Vitamin B12 Increase Cancer Risk: శరీరం సజావుగా పనిచేయడానికి, రక్తం ఉత్పత్తికి మరియు నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్ బి12 ఎంతగానో అవసరం. అయితే, విటమిన్ బి12 స్థాయిలకు, శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందడానికి మధ్య ఒక ఆందోళనకరమైన సంబంధం ఉందని ఇటీవలి ఒక సరికొత్త అధ్యయనం వెల్లడించింది. ఈ పరిశోధన ఇప్పుడు వైద్య రంగంలో సరికొత్త చర్చకు దారితీసింది.

క్యాన్సర్ కణాలకు బి12 ఎలా సహాయపడుతోంది?

పరిశోధకుల కథనం ప్రకారం.. విటమిన్ బి12కు సంబంధించిన కొన్ని జీవరసాయన ప్రక్రియలు క్యాన్సర్ కణాలు చనిపోకుండా, శరీరంలో మనుగడ సాగించడానికి పరోక్షంగా సహాయపడుతున్నట్లు గుర్తించారు.

సాధారణంగా మన శరీరంలో దెబ్బతిన్న, ముసలి లేదా హానికరమైన కణాలను సహజంగానే నాశనం చేసే ఒక అద్భుతమైన రక్షణ ప్రక్రియ ఉంటుంది. దీనిని వైద్య పరిభాషలో "ఫెర్రోప్టోసిస్" అంటారు. అయితే విటమిన్ బి12కు సంబంధించిన కొన్ని ప్రక్రియల వల్ల క్యాన్సర్ కణాలు ఈ సహజ మరణ ప్రక్రియ నుండి చాకచక్యంగా తప్పించుకుంటున్నాయని, ఫలితంగా అవి శరీరంలో వేగంగా విస్తరిస్తున్నాయని ఈ అధ్యయనం సూచిస్తోంది.

ఫెర్రోప్టోసిస్ అంటే ఏమిటి?

ఫెర్రోప్టోసిస్ అనేది ఐరన్ ఆధారిత కణ మరణ ప్రక్రియ. ఇది శరీర రక్షణ వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం. శరీరానికి హాని కలిగించే అసాధారణ కణాలను ఇది ఏరిపారేస్తుంది. ఒకవేళ క్యాన్సర్ కణాలు గనుక ఈ ప్రక్రియ నుండి తప్పించుకుంటే, వాటికి అడ్డుఅదుపు లేకుండా పోతుంది. అవి శరీరంలో చాలా వేగంగా కనుతులుగా మారుతాయి.

సప్లిమెంట్లు వాడుతున్నారా? అయితే జాగ్రత్త..

మనకు లభించే విటమిన్ బి12 రెండు రకాలు. ఒకటి సహజ ఆహారం ద్వారా వచ్చేది, రెండు టాబ్లెట్లు లేదా సిరప్‌ల రూపంలో తీసుకునేది.

సహజ ఆహారాలు:

గుడ్లు, పాలు, పెరుగు, పనీర్ వంటి పాల ఉత్పత్తులు, మాంసం, పప్పుధాన్యాలు మరియు ఆకుకూరల ద్వారా లభించే విటమిన్ బి12 శరీరానికి ఎంతో సురక్షితం మరియు అత్యవసరం.

సప్లిమెంట్లు: చాలామంది డాక్టర్ సలహా లేకుండా సొంతంగా విటమిన్ బి12 సప్లిమెంట్లను వాడుతుంటారు. ఇలా వైద్యుల పర్యవేక్షణ లేకుండా అవసరానికి మించి అధిక మోతాదులో దీర్ఘకాలం పాటు బి12 సప్లిమెంట్లు తీసుకోవడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ చికిత్సపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు.

ఆందోళన చెందాల్సిన పనిలేదు.. కానీ..

ఈ అధ్యయనాలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. కాబట్టి ఆహారం ద్వారా బి12 తీసుకునేవారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విటమిన్ బి12 శరీరానికి శక్తినిచ్చే అత్యవసర పోషకం. అయితే మార్కెట్లో దొరికే విటమిన్ మాత్రలను మాత్రం సొంత వైద్యంతో మింగకుండా.. ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ చేయించుకుని, డాక్టర్ సూచించిన మోతాదులోనే వాడటం ఎల్లప్పుడూ సురక్షితం.

PolitEnt Media

PolitEnt Media

Next Story