నష్టపోయే ప్రమాదం ఉంది..

Activities on Tuesday: హిందూ ధర్మశాస్త్రం ప్రకారం వారంలోని ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. మంగళవారాన్ని కుజ గ్రహం యొక్క రోజుగా పరిగణిస్తారు. కుజుడు భూమి పుత్రుడు కావడంతో భూమిపై నివసించే వారిపై ఈ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రమాదాలు, సంఘర్షణలు మరియు ఆర్థిక నష్టాలకు కుజుడు కారకుడు. అందుకే మంగళవారం నాడు కొన్ని పనులు చేయడం శుభప్రదం కాదని, మరికొన్ని పనులు చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని పండితులు వివరిస్తున్నారు.

మంగళవారం పొరపాటున కూడా చేయకూడని పనులు:

క్షౌరశాల పనులు: మంగళవారం నాడు గోళ్లు కత్తిరించుకోవడం లేదా గడ్డం గీసుకోవడం చేయకూడదు.

అప్పు ఇవ్వడం-తీసుకోవడం: ఈ రోజు ఎవరికైనా అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం కష్టమవుతుంది. అలాగే అప్పు తీసుకుంటే అది తీరకపోగా మరిన్ని కష్టాలకు దారితీస్తుంది.

కొత్త బట్టలు: కొత్త బట్టలు ధరించడానికి మంగళవారం ఏమాత్రం మంచి రోజు కాదు.

ప్రయాణాలు: అత్యవసరమైతే తప్ప ఈ రోజు సుదూర ప్రయాణాలు చేయకపోవడమే మంచిది.

ఆహార నియమం: ఈ రోజు ఉపవాసం ఉండేవారు రాత్రి సమయంలో ఉప్పు కలిగిన పదార్థాలు తినకూడదు. అలాగే నది స్నానం కూడా నిషిద్ధం.

మంగళవారం ఏ పనులు చేస్తే శుభం కలుగుతుంది?

రుణ విముక్తి: మీరు ఎవరికైనా అప్పు చెల్లించాలనుకుంటే మంగళవారం ఉత్తమమైన రోజు. ఈ రోజు అప్పు తీరిస్తే మళ్ళీ అప్పుల పాలు కాకుండా ఉంటారని నమ్మకం.

బ్యాంకు డిపాజిట్లు: బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేయడానికి ఈ రోజు అనుకూలం. దీనివల్ల మీ సంపద పెరుగుతుంది.

దైవ ప్రార్థన: ఆంజనేయుడిని ధ్యానించడం వల్ల ధైర్యం కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కుజ దోష ప్రభావం మరియు ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది.

రాహుకాల పూజ: మంగళవారం రాహుకాలం సమయంలో దుర్గాదేవిని దర్శించుకుని స్తోత్రాలు పఠించడం వల్ల ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది.

వస్త్రధారణ: జాతకంలో కుజుడు అనుకూలంగా ఉన్నవారు ఎరుపు రంగు దుస్తులు ధరించి, ఎరుపు రంగు పూలతో దేవుడిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

హనుమంతుడికి సింధూరంతో పూజ చేసి, సుబ్రహ్మణ్య స్వామికి 11 ప్రదక్షిణలు చేయడం వల్ల గ్రహ దోషాల ప్రభావం తగ్గి పనులు సకాలంలో పూర్తవుతాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story