Doing These Things Right After Waking Up: ఉదయం లేవగానే ఈ పనులు చేస్తున్నారా? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్లే..
అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్లే..

Doing These Things Right After Waking Up: "మొదటి గడియ బాగుంటే రోజంతా బాగుంటుంది" అంటారు పెద్దలు. కానీ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయాన్నే మనం చేసే కొన్ని అలవాట్లు మనల్ని రోగాల పాలు చేస్తున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ ఉదయపు దినచర్యలో మీరు కూడా ఈ క్రింది పొరపాట్లు చేస్తున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి.
నిద్రలేవగానే ఫోన్ చూడటం - మెదడుపై తీవ్ర ఒత్తిడి:
చాలామంది కళ్లు తెరవగానే చేసే మొదటి పని మొబైల్ ఫోన్ వెతకడం. సోషల్ మీడియా నోటిఫికేషన్లు లేదా వార్తలు చూడటం వల్ల మెదడు ఒక్కసారిగా అప్రమత్త స్థితిలోకి వెళ్లిపోతుంది. దీనివల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరిగి రోజంతా చిరాకు, తలనొప్పి, మానసిక అలసట వచ్చే అవకాశం ఉంది. అలాగే ఫోన్ నుండి వచ్చే 'బ్లూ లైట్' కళ్లకు హాని కలిగిస్తుంది.
ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ:
బెడ్ కాఫీ తాగే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. ఖాళీ కడుపుతో కెఫిన్ తీసుకోవడం వల్ల ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. ఇది జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. దీనికి బదులుగా ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగడం ఉత్తమం.
బద్ధకంగా మంచంపైనే ఉండటం:
నిద్రలేచిన తర్వాత కూడా ఎక్కువసేపు మంచం మీద పడుకుని ఉండటం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మందగించి, రోజంతా నీరసంగా, బద్ధకంగా అనిపిస్తుంది. లేవగానే చిన్నపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల శరీరం చురుగ్గా మారుతుంది.
బ్రష్ చేయకుండానే ఆహారం తీసుకోవడం:
రాత్రంతా మన నోటిలో బ్యాక్టీరియా పేరుకుపోతుంది. పళ్ళు తోముకోకుండా నీళ్లు తాగినా లేదా ఏదైనా తిన్నా.. ఆ బ్యాక్టీరియా నేరుగా కడుపులోకి వెళ్లి జీర్ణ సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. కాబట్టి ఉదయాన్నే నోటిని శుభ్రం చేసుకోవడం ప్రాథమిక నియమం.
హడావిడిగా రోజును ప్రారంభించడం:
అలారం మోగగానే ఉలిక్కిపడి లేచి, పనుల కోసం పరుగులు తీయకండి. దీనివల్ల గుండెపై అకస్మాత్తుగా ఒత్తిడి పడుతుంది. భారీ వ్యాయామాలు కూడా నిద్రలేచిన వెంటనే చేయకూడదు. తేలికపాటి నడక లేదా యోగాతో రోజును ప్రారంభించాలి.
ఆరోగ్యకరమైన ఉదయం కోసం చిట్కాలు:
నిద్రలేవగానే కొన్ని నిమిషాల పాటు ప్రశాంతంగా ధ్యానం చేయండి.
ఖాళీ కడుపుతో కనీసం ఒక గ్లాసు నీరు తాగండి.
కాసేపు సూర్యరశ్మి తగిలేలా చూసుకోండి .
మొబైల్ ఫోన్‌కు కనీసం మొదటి 30 నిమిషాలు దూరంగా ఉండండి.

