Yoga: మొదటిసారి యోగా చేస్తున్నారా? ఈ విషయాలను అస్సలు మర్చిపోవద్దు
ఈ విషయాలను అస్సలు మర్చిపోవద్దు

Yoga: ఆరోగ్యంగా ఉండాలనే కోరికతో యోగా సాధన చేసే వారు మనలో చాలా మంది ఉన్నారు. కానీ యోగా చేయడం ప్రారంభిస్తే.. ప్రతిరోజూ చేయాలని అనుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు. అంత దృఢ సంకల్పం చేసుకుని మొదటిసారి యోగా చేయడం ప్రారంభించే వారు కొంచెం భయపడే అవకాశం ఉంది. ఎందుకంటే అది ఎలా చేయాలి? అంటూ మనస్సులో వివిధ ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ యోగా ప్రారంభించే ముందు కొన్ని ముఖ్యమైన అంశాలు గుర్తుంచుకోవాలని యోగా నిపుణులు అంటున్నారు. ఈ చిట్కాలు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతి వ్యక్తి యోగా ప్రారంభించే ముందు అనేక విషయాలను గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో చేసే తప్పులు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి మీరు యోగా ప్రారంభించేటప్పుడు ఈ అంశాలను గుర్తుంచుకోండి.
ఖాళీ కడుపుతో యోగా చేయండి:
యోగా ఎల్లప్పుడూ ఖాళీ కడుపుతో చేయాలి. యోగా చేయడానికి అరగంట ముందు మీరు నీరు త్రాగవచ్చు. కానీ మీ కడుపులో ఆహారం ఉండకుండా చూసుకోవాలి. మీరు ఉదయాన్నే యోగా చేయలేనప్పుడు, భోజనం చేసిన కనీసం 3 గంటల తర్వాత యోగా చేయాలి. మీరు అల్పాహారం తర్వాత యోగా చేస్తే అల్పాహారం తర్వాత కనీసం 2 గంటలు వెయిట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చిరుతిండి లేదా భోజనం తిన్న వెంటనే యోగా చేయకూడదు.
యోగా ఆసనాలను సరిగ్గా చేయండి:
సరైన భంగిమలో యోగా సాధన చేయండి. ఇది అన్నింటికంటే ముఖ్యమైన అంశం. ఎందుకంటే మీరు యోగాను తప్పుగా చేస్తే, అది ప్రయోజనాలను అందించడానికి బదులుగా హాని కలిగిస్తుంది. ప్రతి యోగా భంగిమను ఎలా చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు శారీరక నొప్పి లేదా అనారోగ్యం నుండి ఉపశమనం పొందడానికి యోగా చేస్తుంటే, నిపుణుడిని సంప్రదించి, దానికి తగిన యోగా భంగిమలను సాధన చేయండి. తప్పు యోగా భంగిమలను ఎంచుకోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. స్వచ్ఛమైన గాలిలో యోగా సాధన చేయడం వల్ల మీకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు కూడా అంటున్నారు.
దుస్తుల ఎంపిక:
యోగా చేయడానికి సరైన దుస్తులను ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా సరైన లోదుస్తులను ఎంచుకోవడం. ఇది చాలా ముఖ్యం. మీ శరీరానికి సౌకర్యంగా ఉండే దుస్తులను ఎంచుకోండి. చాలా బిగుతుగా ఉండకుండా చూసుకోవాలి. అంటే గాలి వెళ్ళే దుస్తులను ఎంచుకోవాలి. అదనంగా వాతావరణానికి అనుగుణంగా దుస్తులను ఎంచుకకుంటే..తద్వారా మీరు సులభంగా యోగా సాధన చేయవచ్చు.
యోగా మ్యాట్:
యోగా చేసే ముందు, మీ మ్యాట్ మంచి స్థితిలో ఉందో లేదో చెక్ చేయండి. యోగా మ్యాట్ సౌకర్యవంతంగా లేకపోతే యోగా చేస్తున్నప్పుడు అది అనేక విధాలుగా సమస్యలను కలిగిస్తుంది. యోగా చేస్తున్నప్పుడు జారడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడటానికి బదులుగా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి మ్యాట్ కూడా జారేలా ఉండకూడదు. కాబట్టి మ్యాట్ ఎంపిక చాలా ముఖ్యమైనది.
