Nose Hair: ముక్కు వెంట్రుకలను తొలగిస్తున్నారా..? ఫస్ట్ ఇవి తెలుసుకోండి
ఫస్ట్ ఇవి తెలుసుకోండి

Nose Hair: ముక్కు లోపల వెంట్రుకలు పెరిగితే కొంచెం చికాకుగా, ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. దాంతో కత్తెరతో వాటిని కట్ చేస్తుంటాం. కానీ ఇలా చేయడం మంచిదా? దాని వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? అనేది తెలుసుకోవాలి. ముక్కు లోపల పెరిగే వెంట్రుకలు మన శరీరానికి రక్షణ కవచంగా పనిచేస్తాయి. దీని అర్థం ఈ చిన్న వెంట్రుకలు దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా అలెర్జీని కలిగించే కణాలు మన శ్వాస ద్వారా మన ముక్కులోకి ప్రవేశించకుండా నిరోధిస్తాయి. ఈ వెంట్రుకలు శరీరాన్ని వ్యాధుల నుండి నేరుగా రక్షిస్తాయి. కాబట్టి దానిని తొలగించడం శరీరాన్ని అనారోగ్యానికి గురిచేయడమేనని అన్నారు.
కత్తెర్లతో వెంట్రుకలను వ్యాక్సింగ్ చేయడం లేదా తీయడం ప్రమాదకరం. దీనివల్ల ముక్కు లోపల చర్మంపై చిన్న గాయాలు ఏర్పడతాయి. అక్కడ బ్యాక్టీరియా సులభంగా ప్రవేశించి ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. ముక్కు లోపలి భాగం చాలా సున్నితంగా ఉంటుందని, ఇన్ఫెక్షన్ త్వరగా వ్యాపిస్తుందని నిపుణులు అంటున్నారు. మీ ముక్కు లోపలి వెంట్రుకలను తొలగించాల్సి వస్తే చిన్న లేదా శుభ్రమైన కత్తెరతో కత్తిరించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వెంట్రుకల మూలాలను టచ్ చేయొద్దు. ఈ పద్ధతి సురక్షితమైనది, చాలా ప్రభావవంతమైనదని నిపుణులు చెబుతున్నారు.
