ఊహించని బెనిఫిట్స్ మీ సొంతం

Healthy Kidneys: ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలలో దోసకాయకు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో విటమిన్ బి, సి, కె, పొటాషియం, ఫిసెటిన్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. అయితే, దీనిని ఎప్పుడు, ఎలా తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.

దోసకాయతో కలిగే ప్రయోజనాలు:

మధుమేహానికి మేలు: మధుమేహం ఉన్నవారు తరచుగా మూత్ర విసర్జన సమస్యలతో బాధపడతారు. దీని వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. ఈ సమస్యను నివారించడానికి దోసకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది.

శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది: దోసకాయలో 95% నీరు ఉంటుంది. ఇది శరీరం నుండి విష పదార్థాలను (టాక్సిన్స్) తొలగించడానికి సహాయపడుతుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

మలబద్ధకం దూరం: దోసకాయలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

మూత్రపిండాల ఆరోగ్యం: దోసకాయ రసం తాగడం వల్ల మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి, శరీర వ్యవస్థ సజావుగా పనిచేయడానికి తోడ్పడుతుంది.

దోసకాయ తినడానికి సరైన సమయం:

దోసకాయను ఉదయం లేదా మధ్యాహ్నం భోజనానికి ముందు తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రిపూట దోసకాయను తినకపోవడం మంచిది. దోసకాయలోని అధిక ఫైబర్, నీటి శాతం కారణంగా రాత్రిపూట జీర్ణం కావడం కష్టమవుతుంది. ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. దీనివల్ల నిద్ర కూడా సరిగా పట్టదు. అందుకే వీలైనంత వరకు మధ్యాహ్నం సమయాల్లోనే దోసకాయను తినడానికి ప్రయత్నించండి.

PolitEnt Media

PolitEnt Media

Next Story