ఈ లాభాలు తెలిస్తే అస్సలు వదలరు

Eating Garlic on an Empty Stomach in the Morning: భారతీయ వంటకాల్లో వెల్లుల్లికి ప్రత్యేక స్థానం ఉంది. రుచిని పెంచడమే కాకుండా వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు అనేక వ్యాధులను నయం చేయగలవని మన పూర్వీకుల కాలం నుంచే నమ్ముతుంటారు. ముఖ్యంగా ఇందులో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది.

వెల్లుల్లిలోని పోషక విలువలు:

వెల్లుల్లిలో మన శరీరానికి అవసరమైన పాస్పరస్, జింక్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు విటమిన్ సి, కె, ఫోలేట్, నియాసిన్, థియామిన్ వంటి కీలక విటమిన్లు కూడా లభిస్తాయి.

ఖాళీ కడుపుతో తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు:

గుండె ఆరోగ్యం - కొలెస్ట్రాల్: ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది రక్తపోటును నియంత్రించి గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది.

రోగనిరోధక శక్తి: ఇందులోని యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలు ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి. జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధుల బారి నుండి రక్షణ లభిస్తుంది.

బరువు తగ్గడం: వెల్లుల్లి జీవక్రియను వేగవంతం చేస్తుంది. దీనివల్ల శరీరంలోని కొవ్వు వేగంగా కరుగుతుంది. ఫలితంగా బరువు తగ్గడానికి దోహదపడుతుంది.

శరీర శుద్ధి: కాలేయాన్ని శుభ్రపరిచి, శరీరంలోని హానికర విషతుల్యాలను బయటకు పంపడంలో వెల్లుల్లిలోని సల్ఫర్ సమ్మేళనాలు కీలక పాత్ర పోషిస్తాయి.

జీర్ణక్రియ మెరుగు: గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది అద్భుతమైన మందులా పనిచేస్తుంది.

చర్మం - జుట్టు: వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అలాగే జుట్టు రాలడాన్ని తగ్గించి, కుదుళ్లను బలోపేతం చేస్తాయి.

మధుమేహం: రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడంలో వెల్లుల్లి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఎలా తీసుకోవాలి?

ఉదయం బ్రష్ చేసిన తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బ తొక్క తీసి చిన్న ముక్కలుగా చేసి నమిలి తినవచ్చు.

పచ్చిగా తినడం కష్టంగా అనిపిస్తే, ఆ ముక్కలను గోరువెచ్చని నీటితో కలిపి మింగేయవచ్చు.

మరీ గాటుగా అనిపిస్తే నీటిలో నానబెట్టుకుని కూడా తీసుకోవచ్చు.

వెల్లుల్లిని తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది. మీకు ఏదైనా అలర్జీలు ఉన్నా లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నా ఒకసారి వైద్యుడిని సంప్రదించి ప్రారంభించడం ఉత్తమం.

PolitEnt Media

PolitEnt Media

Next Story