క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ

Health: ప్రాణంతక వ్యాధుల్లో క్యాన్సర్ ఒక్కటి. అయితే క్యాన్సర్ కు రోజు వారీ ఫుడ్ కూడా కారణమంటున్నారు డాక్టర్లు..మనం తీసుకునే ఆహారంలో కొన్ని ఫుడ్స్ కూడా క్యాన్సర్ రావటానికి, శరీరంలో పెరగటానికి దోహదపడతాయని చెబుతున్నారు . వీటిని మానేయటం ప్రజలకు వారి దీర్ఘకాలిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని ఆయన వెల్లడించారు. ఇంతకీ ఆ ఆహార పధార్థాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

చక్కెర పానీయాలు

ఎనర్జీ అందిస్తున్నప్పటికీ వీటిలో అధిక స్థాయిలో ఉండే చక్కెర శరీరంలోని రక్తంలో షుగర్ లెవెల్స్ అమాంతం పెంచేస్తాయంట. అలాగే ఇవి చాపకింద నీరులా దీర్ఘకాలికంగా ఉండే ఇన్ ఫ్లమేషన్లకు ఆహారంగా మారి కొన్నాళ్లకు కేన్సర్ పెరగటానికి దోహదపడతాయి. దీంతో బ్రెస్ట్ కేన్సర్, ప్యాంక్రియాటిక్ కేన్సర్, కోలన్ కేన్సర్ వంటివి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

వేయించిన ఆహారాలు

స్నాక్స్ నుంచి భోజనంలోని కూరల వరకు నూనెలో వేయించిన ఆహారాలు పెరుగుతున్నాయి. ప్రధానంగా వాడిన నూనెను మళ్లీ వినియోగించి చేసే వంటకాల ద్వారా ఏర్పడే ఇన్‌ఫ్లమేషన్స్ కేన్సర్ రిస్క్

బాగా కాల్చిన మాంసం

ప్రజలు ఇటీవలి కాలంలో ఎక్కువగా తింటున్న స్మోకీ, గ్లిల్డ్స్ మాంసపు ఆహారాలతో కేన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు . ప్రధానంగా మాంసాన్ని ఎక్కువగా కాల్చటం లేదా నల్లగా వచ్చే వరకు గ్లిల్ చేయటం ప్రమాకరమంట

మద్యం సేవించటం

మద్యం సేవించటం వల్ల శరీరంలో హార్మోన్ల పనితీరు దెబ్బతిని బ్రెస్ట్ కేన్సర్, లివర్ కేన్సర్ వంటివి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది శరీరం న్యూట్రిషన్లను గ్రహించటానికి అవరోధంగా మారుతుందని తద్వారా డీఎన్ఏ రిపేర్ ప్రక్రియ దెబ్బతిని కేన్సర్ డెవలప్ అయ్యే ప్రమాదాలు పెరుగుతాయి

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్

వీటిలో ఉండే రిఫైన్డ్ షుగర్స్, ఆర్టిఫీషియల్ ఫ్లేవర్లు, అధిక చెడు కొవ్వులు అనారోగ్యాలకు కారణంగా మారతాయి. వీటిని తరచుగా లేదా ఎక్కువగా తీసుకోవటం వల్ల శరీరంలో కేన్సర్ పెరగటానికి కారణంగా మారతాయి. అయితే కేన్సర్ రాకుండా ఉండటానికి మంచి ఆహారపు అలవాట్లతో పాటు వ్యాయామం కూడా అవసరం అని వారు చెబుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story