ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Essential Care Tips After Cesarean Section: ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది ఒక అద్భుతమైన అనుభూతి. అయితే, సిజేరియన్ ద్వారా డెలివరీ అయినప్పుడు, సాధారణ ప్రసవం కంటే కోలుకోవడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఆపరేషన్ తర్వాత మహిళలు తమ ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, త్వరగా కోలుకోవడానికి ఏం చేయాలో మనం తెలుసుకుందాం.

తగినంత విశ్రాంతి. సిజేరియన్ తర్వాత శరీరం లోపల కోతలు మానడానికి సమయం పడుతుంది. అందుకే బరువులు ఎత్తడం, మెట్లు ఎక్కువగా ఎక్కడం వంటి పనులు కనీసం 6 వారాల వరకు చేయకూడదు. ఇక రెండవది.. కుట్లు ఉన్న చోట పరిశుభ్రత. గాయం ఉన్న చోట ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. డాక్టర్ సూచించిన విధంగా డ్రెస్సింగ్ మార్చుకుంటూ, ఇన్ఫెక్షన్ లక్షణాలు అంటే ఎరుపు రంగులోకి మారడం లేదా పసుపు రంగులో ద్రవం రావడం వంటివి గమనిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

సరైన ఆహారం. త్వరగా కోలుకోవడానికి ప్రోటీన్ ,విటమిన్-సి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇది కణజాలం పునరుద్ధరణకు సహాయపడుతుంది. అలాగే, మలబద్ధకం సమస్య రాకుండా ఉండటానికి పీచు పదార్థాలు (Fibre food) ఎక్కువగా ఉన్న ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. రోజుకు కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. పాలు కూడా బాగా పడతాయి.

నడక. ఆపరేషన్ తర్వాత పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవడం కంటే, ఇంట్లోనే నెమ్మదిగా అడుగులు వేయడం మంచిది. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. చివరిగా, మానసిక ఆరోగ్యం. కొత్తగా తల్లి అయినప్పుడు ఒత్తిడి సహజం, కానీ వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యుల సహాయం తీసుకోండి.

PolitEnt Media

PolitEnt Media

Next Story