Even Without Alcohol, Liver Can Fail: మద్యం ముట్టకపోయినా లివర్ పని ఖతమ్! తాగని వారిలోనూ పెరుగుతున్న కాలేయ వ్యాధులు..
తాగని వారిలోనూ పెరుగుతున్న కాలేయ వ్యాధులు..

Even Without Alcohol, Liver Can Fail: సాధారణంగా కాలేయం దెబ్బతిన్నదంటే.. సదరు వ్యక్తికి మద్యం తాగే అలవాటు ఉండి ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ ఇటీవలి కాలంలో మద్యం అస్సలు ముట్టని వారిలో కూడా కాలేయ సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. లేడీ హార్డింగ్ హాస్పిటల్ వైద్య విభాగం అధిపతి డాక్టర్ ఎల్.హెచ్. ఘోటేకర్ అందించిన సమాచారం ప్రకారం.. మన రోజువారీ అలవాట్లే ఇందుకు ప్రధాన కారణం.
మద్యం లేకుండా కాలేయం ఎందుకు దెబ్బతింటుంది?
ఆల్కహాల్ ఒక్కటే కాలేయానికి శత్రువు కాదు, ఈ కింది అంశాలు కూడా అంతే ప్రమాదకరం:
అనారోగ్యకరమైన ఆహారం: అతిగా వేయించిన పదార్థాలు, జంక్ ఫుడ్, బయటి ఆహారం తీసుకోవడం వల్ల కాలేయంపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది.
అధిక బరువు : శరీర బరువు పెరగడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోయి నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్'కు దారితీస్తుంది.
సొంత వైద్యం: వైద్యుడి సలహా లేకుండా ఇష్టానుసారంగా మందులు వాడటం వల్ల కాలేయం దెబ్బతింటుంది.
వైరల్ ఇన్ఫెక్షన్లు:
కలుషితమైన నీరు లేదా ఆహారం ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్లు కాలేయంపై ప్రభావం చూపుతాయి.
జీవనశైలి: సరైన నిద్ర లేకపోవడం, నిరంతర ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల మెటబాలిజం దెబ్బతింటుంది.
ప్రమాదకర సంకేతాలు - వీటిని విస్మరించవద్దు:
కాలేయం దెబ్బతింటున్నప్పుడు శరీరం ఇచ్చే ప్రాథమిక లక్షణాలు ఇవే..
1. ఆకలి మందగించడం, తరచుగా అజీర్ణం, గ్యాస్ సమస్యలు రావడం.
2. ఉదరం (కడుపు) కుడి వైపున భారంగా అనిపించడం.
3. కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారడం (కామెర్లు).
4. మూత్రం ముదురు రంగులో రావడం, కాళ్ళలో వాపు రావడం.
5. విపరీతమైన బలహీనత, నీరసం.
ఎవరికి ముప్పు ఎక్కువ?
మధుమేహం, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు.
శారీరక శ్రమ లేకుండా గంటల తరబడి కూర్చుని ఉండేవారు.
కుటుంబంలో కాలేయ వ్యాధుల చరిత్ర ఉన్నవారు.
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు.
లివర్ ఆరోగ్యం కోసం 5 సూత్రాలు:
ఇంటి భోజనం: నూనె, మసాలాలు తక్కువగా ఉండే తాజా ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇవ్వండి.
బరువు నియంత్రణ: వ్యాయామం లేదా నడక ద్వారా శరీర బరువును అదుపులో ఉంచుకోండి.
నీరు: రోజుకు తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి.
వైద్య సలహా: ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే డాక్టర్ సూచన మేరకే మందులు వాడండి.
ఒత్తిడి నిర్వహణ: యోగా, ధ్యానం చేయడం వల్ల కాలేయంపై ఒత్తిడి తగ్గుతుంది.

