ఇలా గుర్తిస్తే తప్పించుకోవచ్చు..

Fake Potatoes in the Market: పండ్లు, ప్యాక్ ఫుడ్స్‌తోపాటు ఇప్పుడు కూరగాయలు కూడా నకిలీల బారిన పడుతున్నాయి. మార్కెట్లో బంగాళదుంపల పేరుతో విషపూరిత రసాయనాలతో తయారైన నకిలీ ఆలుగడ్డలు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పైకి తాజాగా, సహజంగా పండినట్లు కనిపించే ఈ నకిలీ బంగాళదుంపలు శరీరానికి తీవ్ర హాని కలిగిస్తాయి. జీర్ణసమస్యలు, అలర్జీలు, అవయవాలకు దీర్ఘకాలిక నష్టం వాటివల్ల వచ్చే ప్రమాదాలు. కాబట్టి ప్రతి కొనుగోలుదారుడూ జాగ్రత్తగా ఉండాల్సిందే!

నకిలీ బంగాళదుంపలను ఎలా గుర్తించాలి? సులువైన 5 టెస్టులు

వాసన పరీక్ష: అసలు బంగాళదుంపకు మట్టి వాసన వస్తుంది. రసాయనిక వాసన లేదా కృత్రిమ సుగంధం వస్తే అది నకిలీ!

రంగు చెక్: బంగాళదుంపను కోసి చూడండి. లోపల-బయట ఒకే రంగు ఉండాలి. లోపల రంగు మారినా, వింతగా కనిపిస్తే జాగ్రత్త!

రబ్ టెస్ట్: పై తొక్కను లేదా ఉపరితలాన్ని రుద్దండి. చేతికి రంగు లేదా పూత రాలితే అది కృత్రిమ పూతతో చేసిన నకిలీ!

నీటి పరీక్ష: ఒక గిన్నె నీళ్లలో వేయండి. అసలు బంగాళదుంప మునిగిపోతుంది. నకిలీవి పైకి తేలుతాయి!

తొక్క & ఆకారం: అసలు బంగాళదుంప తొక్క గరుకుగా, సహజంగా ఉంటుంది. అసహజంగా నునుపుగా, మందంగా ఉంటే రసాయనాలతో పండించినవి!

నకిలీవి అనుమానం వస్తే ఏం చేయాలి?

నమ్మకమైన వ్యాపారుల దగ్గరే కొనండి.

అసాధారణంగా శుభ్రంగా, ప్రకాశవంతంగా, గుండ్రంగా ఉంటే రెట్టించి జాగ్రత్త!

వంటకు ముందు బాగా కడిగి తొక్క తీయండి. డౌట్ ఉంటే పారేయండి.

కుటుంబం, స్నేహితులకు చెప్పి అవగాహన కల్పించండి.

ఆహార భద్రత మన చేతుల్లోనే ఉంది. ఒక్క క్షణం ఆలోచించి, ఈ సింపుల్ టెస్టులు చేస్తే మీ ఇంటికి స్వచ్ఛమైన కూరగాయలే వస్తాయి. ఆరోగ్యం కోసం జాగ్రత్త..!

PolitEnt Media

PolitEnt Media

Next Story