జామకాయ తింటే విషంతో సమానం..!

Guava: శీతాకాలం ప్రారంభంతో మార్కెట్లో జామ పండ్లు సమృద్ధిగా లభిస్తున్నాయి. ఈ పండును సూపర్‌ఫుడ్‌గా పరిగణించవచ్చు. ఎందుకంటే ఇది సోడియం, పొటాషియం, ఫైబర్, ప్రోటీన్, ఐరన్ మరియు విటమిన్ సి వంటి ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. జామపండ్లు ముఖ్యంగా జీర్ణ సమస్యలు, శారీరక బలహీనతను తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని హానికరమైన కణాల నుండి రక్షించి, తీవ్రమైన వ్యాధులు రాకుండా నివారిస్తాయి. అయితే ఈ అద్భుతమైన పండు ఆరోగ్యానికి మేలు చేసినా, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మాత్రం ప్రతికూల ప్రభావాలు చూపుతుంది.

ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జామ తినకూడదు

అలెర్జీలు ఉన్నవారు

కొంతమందికి జామ తినడం వల్ల అలెర్జీ వచ్చే అవకాశం ఉంది. దద్దుర్లు, దురద, చర్మంపై వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. జామ అలెర్జీ ఉన్నవారు దీనిని పూర్తిగా మానుకోవాలి.

తీవ్ర జీర్ణ సమస్యలు ఉన్నవారు

ఉబ్బసం, విరేచనాలు, గ్యాస్, గుండెల్లో మంట లేదా అజీర్ణం వంటి తీవ్రమైన జీర్ణ సమస్యలు ఉన్నవారు జామకాయ తినకూడదు. జామకాయలో అధికంగా ఉండే విటమిన్ సి, ఫ్రక్టోజ్ జీర్ణ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి. జామకాయలోని విత్తనాలు, ఫైబర్ జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెంచుతాయి.

శీతాకాలపు సమస్యలు

జామకాయకు చల్లదనాన్ని కలిగించే స్వభావం ఉంటుంది. శీతాకాలంలో దీనిని అధికంగా తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది.

డయాబెటిస్, శస్త్రచికిత్స తర్వాత జాగ్రత్తలు:

రక్తంలో చక్కెర: జామపండులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం డయాబెటిస్ ఉన్నవారికి మంచిదే. కానీ మీ రక్తంలో చక్కెర స్థాయిలు ఇప్పటికే తక్కువగా ఉంటే, ఈ పండును తినకుండా ఉండటం మంచిది. మీరు రక్తంలో చక్కెరను తగ్గించడానికి మందులు తీసుకుంటుంటే, జామపండు తినే ముందు వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.

స్త్రచికిత్స జామపండు తినడం వల్ల రక్తస్రావం అయ్యే ప్రమాదం పెరిగి, గాయం మానడం ఆలస్యం కావచ్చు. అందుకే ఏదైనా శస్త్రచికిత్స తర్వాత వెంటనే జామపండు తినకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story