టీ ఆకులతో ఇలా చేస్తే..

Fridge Smelling Bad: చాలామంది ఫ్రిజ్‌లో రకరకాల వస్తువులను నిల్వ చేస్తారు. కూరగాయలు, పండ్లు, పాల నుంచి మిగిలిపోయిన ఆహారం వరకు అన్నింటినీ ఫ్రిజ్‌లో పెడుతూ ఉంటారు. దీనివల్ల ఫ్రిజ్‌లో అన్ని రకాల వాసనలు కలిసిపోయి దుర్వాసన వస్తుంది. ఫ్రిజ్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే ఈ వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. ఫ్రిజ్‌లోని ఈ దుర్వాసనను తొలగించడానికి టీ ఆకులు అద్భుతమైన చిట్కాగా పనిచేస్తాయి.

టీ ఆకులు: ఒక చిన్న గిన్నెలో లేదా మస్లిన్ బ్యాగ్‌లో ఒక టీస్పూన్ టీ ఆకులను వేసి ఫ్రిజ్‌లో ఒక మూల ఉంచండి. టీ ఆకులకు వాసనలను గ్రహించే శక్తి ఉంటుంది. ఇది ఫ్రిజ్‌లోని చెడు వాసనలను తగ్గించి, తాజాగా ఉండేలా చేస్తుంది. ప్రతిరోజూ టీ బ్యాగును మారుస్తూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి.

టీ ఆకులు బేకింగ్ సోడా : టీ ఆకులను బేకింగ్ సోడాతో కలిపి ఒక చిన్న గిన్నెలో వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి. బేకింగ్ సోడా తేమను గ్రహించి చెడు వాసనలను తొలగిస్తుంది. ఈ మిశ్రమాన్ని ప్రతి 7-10 రోజులకు ఒకసారి మార్చాలి.

వాడిన టీ బ్యాగులు : టీ తయారు చేయడానికి వాడిన తర్వాత చల్లబడిన టీ బ్యాగులను ఫ్రిజ్‌లో పెడితే దుర్వాసన రాకుండా ఉంటుంది.

టీ ఆకులు బొగ్గు : టీ ఆకులకు బొగ్గును కలిపి ఒక కంటైనర్‌లో వేసి ఫ్రిజ్‌లో ఉంచండి. బొగ్గు అదనపు తేమను, చెడు వాసనలను గ్రహిస్తుంది. ఈ మిశ్రమాన్ని ప్రతి నెలా మార్చాలి.

గ్రీన్ టీ ఆకులు: ఫ్రీజర్‌లో దుర్వాసన రాకుండా ఉండటానికి తాజా లేదా ఎండిన టీ ఆకులను ఒక చిన్న సంచిలో వేసి ఫ్రీజర్‌లో ఉంచండి. ఇవి ఫ్రీజర్‌ను తాజాగా ఉండేలా చేస్తాయి.

టీ ఆకులు నిమ్మరసం: టీ ఆకులను నిమ్మరసంతో కలిపి ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి. నిమ్మరసం సహజసిద్ధమైన వాసనతో ఫ్రిజ్‌ను తాజాగా ఉంచుతుంది.

టీ ఆకులు నారింజ తొక్క: నారింజ తొక్కలు కూడా నిమ్మకాయలాగే పనిచేస్తాయి. కొన్ని ఎండిన నారింజ తొక్కలను ఒక మెష్ బ్యాగ్‌లో వేసి ఫ్రిజ్‌లో ఉంచండి. టీ ఆకులు అందుబాటులో లేకపోతే టీ పొడిని కూడా ఉపయోగించవచ్చు. నారింజ తొక్కలు చెడు వాసనలను తగ్గించి సిట్రస్ వాసనతో ఫ్రిజ్‌ను నింపుతాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story