Good News for Diabetes Patients: షుగర్ పేషెంట్లకు గుడ్‌న్యూస్: : డయాబెటిస్ రకాన్ని ఇట్టే పట్టేయనున్న సరికొత్త ఏఐ టూల్
సరికొత్త ఏఐ టూల్

Good News for Diabetes Patients: వైద్యరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగా ఏఐ సంచలనాలు సృష్టిస్తోంది. మధుమేహం లేదా షుగర్ వ్యాధికి సంబంధించి శాస్త్రవేత్తలు ఒక విప్లవాత్మకమైన కొత్త ఏఐ టూల్‌ను అభివృద్ధి చేశారు. ఇది కేవలం శరీరంలో షుగర్ ఉందని గుర్తించడమే కాకుండా, అది ఏ రకమైన డయాబెటిస్ అనే విషయాన్ని కూడా అత్యంత ఖచ్చితంగా వెల్లడిస్తుందని 'సైంటిఫిక్ రిపోర్ట్స్' జర్నల్ వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని వేధిస్తున్న డయాబెటిస్‌లో కేవలం టైప్ 1, టైప్ 2 మాత్రమే కాకుండా.. టైప్ 3, టైప్ 4, గెస్టేషనల్ డయాబెటిస్, ప్రీ-డయాబెటిస్ వంటి అనేక రకాలు ఉన్నాయి. వ్యాధి ఏ రకానికి చెందినదో కచ్చితంగా తెలుసుకోకపోతే, చికిత్సలో జాప్యం జరిగే ప్రమాదం ఉంటుంది.
అయితే ఈ కొత్త ఏఐ టూల్ క్లినికల్, పేషెంట్ హెల్త్ డేటాను విశ్లేషించడం ద్వారా పనిచేస్తుంది. రోగి ఆరోగ్య సమాచారాన్ని ఈ ఏఐ సిస్టమ్‌కు అందించగానే, అది షుగర్ వ్యాధి రకాన్ని కచ్చితంగా గుర్తించి నిర్దిష్టమైన రోగనిర్ధారణ లేబుల్‌ను కేటాయిస్తుంది. దీనివల్ల డాక్టర్లు మరింత మెరుగైన, వ్యక్తిగతీకరించిన పర్సనలైజ్డ్ ట్రీట్‌మెంట్‌ను అందించడానికి వీలవుతుంది. ప్రస్తుతం ఈ టూల్ టెస్టింగ్ దశలో ఉన్నప్పటికీ, భవిష్యత్‌లో డయాబెటిస్ వైద్య చికిత్సలో ఇది ఒక సరికొత్త విప్లవం సృష్టించడం ఖాయమని నిపుణులు భావిస్తున్నారు.

