Diabetes Patients: డయాబెటిస్ లేదా మధుమేహంతో బాధపడుతున్న రోగులకు ఒక అద్భుతమైన శుభవార్త. ప్రతిరోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటూ నరకం అనుభవిస్తున్న వారికి ఉపశమనం కలిగిస్తూ... ప్రపంచంలోనే మొట్టమొదటి 'వారానికి ఒకసారి మాత్రమే తీసుకునే ఇన్సులిన్' ఇప్పుడు భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది.

ప్రముఖ ఫార్మా దిగ్గజం 'నోవో నార్డిస్క్' (Novo Nordisk) సంస్థ... 'అవిక్లి' (Awiqli / Insulin Icodec) పేరుతో ఈ విప్లవాత్మక ఇన్సులిన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటివరకు టైప్-2 డయాబెటిస్ రోగులు ఏడాదికి దాదాపు 365 ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వచ్చేది. కానీ, ఈ కొత్త ఇన్సులిన్ వల్ల... ఏడాదికి కేవలం 52 ఇంజెక్షన్లు తీసుకుంటే సరిపోతుంది.

రోజువారీ ఇన్సులిన్ ఇంజెక్షన్ల వల్ల వచ్చే నొప్పి, భయం, రోజు మార్చి రోజు మర్చిపోయే ఇబ్బందులకు ఈ వారాంతపు ఇన్సులిన్ శాశ్వత పరిష్కారం చూపనుంది. క్లినికల్ ట్రయల్స్ లో ఇది అత్యంత సురక్షితమైనదని, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సమర్థవంతంగా నియంత్రిస్తుందని నిపుణులు స్పష్టం చేశారు.భారత్‌లో డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో... ఈ 'వన్స్-వీక్లీ ఇన్సులిన్' వైద్య రంగంలో ఒక మైలురాయిగా నిలవనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story