Good News for Heart Patients: గుండె రోగులకు గుడ్ న్యూస్.. దానిమ్మతో ఆ డేంజర్ సమస్యకు చెక్! లండన్ రీసెర్చ్‌లో మైండ్ బ్లోయింగ్ నిజాలు..
మైండ్ బ్లోయింగ్ నిజాలు..

Good News for Heart Patients: దానిమ్మ పండు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు.. కానీ ఇది మొండి గుండె జబ్బులను కూడా నయం చేయగలదా? లండన్ శాస్త్రవేత్తలు జరిపిన తాజా పరిశోధనలో ఒక అద్భుతమైన సమ్మేళనం బయటపడింది. గుండె పనితీరును ఏకంగా 80 శాతం మెరుగుపరిచే ఆ మ్యాజిక్ ఏంటో ఇక్కడ చూద్దాం.
గుండెకు సంజీవనిలా దానిమ్మ.. లండన్ సైంటిస్టుల రీసెర్చ్‌లో సంచలన విషయాలు..
మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో నేటి కాలంలో గుండె సంబంధిత సమస్యలు సర్వసాధారణమైపోయాయి. ముఖ్యంగా గుండె కండరాలు బిగుసుకుపోయి సరైన రక్త ప్రసరణ జరగకపోవడం పెద్ద సమస్యగా మారుతోంది. అయితే ఈ సమస్యకు దానిమ్మ పండు ద్వారా పరిష్కారం దొరికే అవకాశం ఉందని లండన్‌కు చెందిన ప్రఖ్యాత కింగ్స్ కాలేజ్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది.
ఏంటీ యురోలిథిన్ A
మనం దానిమ్మ, వాల్‌నట్స్, కొన్ని రకాల బెర్రీలను తిన్నప్పుడు మన శరీరంలోని జీర్ణ వ్యవస్థ వాటిని ప్రాసెస్ చేసి యురోలిథిన్ A అనే సహజ రసాయన సమ్మేళనాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ సమ్మేళనం గుండె, రక్తనాళాల కణాలపై నేరుగా పనిచేసి గుండె కండరాలు సరళంగా మారేందుకు సహకరిస్తుంది.
అసలు గుండెలో వచ్చే సమస్య ఏంటి?
చాలామందిలో గుండె కండరాలు గట్టిపడిపోయి, ప్రతి గుండె చప్పుడు తర్వాత సాధారణ స్థితికి రాలేకపోతాయి. గుండె సరిగ్గా రిలాక్స్ అవ్వకపోతే లోపలికి తగినంత రక్తం చేరదు. ఫలితంగా శరీర భాగాలకు రక్తాన్ని సరిగ్గా పంపింగ్ చేయలేదు. దీనివల్ల కొద్ది దూరం నడిచినా ఆయాసం రావడం, విపరీతమైన నీరసం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
పరిశోధనలో వెల్లడైన కీలక అంశాలు:
80 శాతం మెరుగుదల:
ల్యాబ్‌లో జంతువులపై జరిపిన ప్రయోగాల్లో ఈ 'యురోలిథిన్ A' ఇవ్వడం వల్ల వాటి గుండె పనితీరులో ఏకంగా 80 శాతం మేర మెరుగుదల కనిపించింది.
కండరాల వాపు మాయం:
గుండె కండరాలపై పేరుకుపోయే ప్రమాదకరమైన మచ్చలు , కండరాలు అధికంగా మందం కావడం వంటి సమస్యలు భారీగా తగ్గాయి.మానవ కణజాలంపై టెస్ట్: ల్యాబ్‌లో మానవ కణాలతో తయారు చేసిన గుండె కణజాలంపై కూడా దీనిని పరీక్షించగా.. కండరాలు రిలాక్స్ అవ్వడానికి ఇది ఎంతగానో తోడ్పడుతున్నట్లు స్పష్టమైంది.
వైద్యులు చెప్పే జాగ్రత్తలు:
ఈ అధ్యయనం భవిష్యత్తులో గుండె జబ్బులకు సరికొత్త మందులు తయారు చేయడానికి బలమైన పునాది వేసినప్పటికీ, ప్రజలు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు:
మందులకు ప్రత్యామ్నాయం కాదు
గుండె సమస్యలు ఉన్నవారు డాక్టర్ ఇచ్చే మందులను ఆపేసి కేవలం దానిమ్మ పైనే ఆధారపడకూడదు.
క్లినికల్ ట్రయల్స్ ఇంకా బాకీ ఉన్నాయి: 80 శాతం మెరుగుదల అనేది ల్యాబ్ పరిశోధనల్లో కనిపించింది. మనుషులపై పూర్తిస్థాయి క్లినికల్ ట్రయల్స్ ఇంకా జరగాల్సి ఉంది.
ఆహారంలో చేర్చుకోండి:
దానిమ్మ, డ్రై ఫ్రూట్స్ వంటివి గుండెను ఆరోగ్యంగా ఉంచే మంచి సమతుల్య ఆహారం మాత్రమే.

