Changes in Women After the Age of 40: ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఇల్లు, ఆఫీసు, కుటుంబ బాధ్యతలను సజావుగా నిర్వహిస్తున్నారా? బయటకి ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నా, లోపల మాత్రం తీవ్రమైన అలసట, నీరసంతో బాధపడుతున్నారా?దీనిని వైద్య పరిభాషలో 'హై-ఫంక్షనింగ్ ఎగ్జాస్టన్' (High-Functioning Exhaustion) అంటారు. ముఖ్యంగా 35 నుంచి 45 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దీనికి ప్రధాన కారణం 'పెరిమెనోపాజ్ మెనోపాజ్ రావడానికి కొన్ని సంవత్సరాల ముందు మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లలో తీవ్రమైన మార్పులు జరుగుతాయి. ఈ హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వల్ల నిద్రలేమి, మానసిక ఆందోళన, బ్రెయిన్ ఫాగ్ అంటే విషయాలపై దృష్టి పెట్టలేకపోవడం ,రోజంతా తీవ్రమైన శారీరక, మానసిక అలసట ఎదురవుతాయి.అయితే చాలామంది మహిళలు ఇవన్నీ కేవలం సాధారణ పని ఒత్తిడి అని భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. బయటకు తమ బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తిస్తున్నప్పటికీ, లోపల శరీరం తీవ్రమైన శ్రమకు గురవుతుంది.

దీని నుంచి ఉపశమనం పొందడం ఎలా?

మీ శరీరంలో వస్తున్న ఈ మార్పులను ముందుగా గుర్తించండి, స్వీకరించండి.

పోషకాహారం తీసుకోవడం, రోజూ కాసేపు నడక లేదా యోగా చేయడం అలవాటు చేసుకోండి.

సరైన నిద్ర ఉండేలా చూసుకోండి మరియు ఒత్తిడిని తగ్గించుకునే పద్ధతులను పాటించండి.

అవసరమైతే సంకోచించకుండా వైద్యులను కలసి హార్మోనల్ చెకప్స్ ,సలహాలు తీసుకోండి.

Next Story