కూర దోసకాయలు కోసిన తర్వాత చేదుగా ఉంటే పారేయాలనిపించదు. కూరలో వేయకున్నా ఉప్పు, కారం అద్దుకుని తినాలనిపిస్తుంది. అయితే చేదు దోసకాయలను తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. వాటిల్లో కుకుర్ బిటాసిన్లు (cucurbitacins) అనే సేంద్రియ సమ్మేళనాలు (సహజ రసాయనాలు అనుకోవచ్చు) ఉండటం వల్ల చేదుగా అనిపిస్తాయి. కుకుర్ బిటాసిన్లు విష పూరితాలు. మనకు వెంటనే హాని కలిగించక పోయినా దానిని విచ్ఛిన్నం చేయడానికి లివర్ చాలా శ్రమ పడుతుందని అంటున్నారు. అందుకని చేదు దోసకాయలను తినక పోవడమే మంచిది.

దోసకాయలను పండించేటప్పుడు తగినంత నీటి సరఫరా లేకపోయినా, అధిక ఉష్ణోగ్రతలున్నా అలాంటి తోటల్లోని దోసకాయల్లో ఈ విష పదార్థం తయారవుతుంది. మొక్కలకు తగినంత నీరందిస్తే పంట నష్టపోకుండా చూసుకోవచ్చు. మెట్ట చేలలో అంతర పంటగా వేసినప్పుడు అవసరమైనంత నీరు లభించక పండిన దోసల్లో ఎక్కువ చేదుగా ఉంటాయి.

(మన నోటికి చేదుగా అనిపించే ప్రతి తినేవస్తువు విషపూరితమైనదిగానే భావించాలి) కాకర లాంటి వాటిలో కూడా ఉన్నా తక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు ప్రయోజనం కలిగిస్తాయి)


Updated On
Next Story