నిర్లక్ష్యం చేస్తున్నారా.?

Heart Attack Alert: గుండె పోట్లు కలవరపెడుతున్నాయి. ఏజ్ తో సంబంధం లేకుండా ఈ మధ్య గుండెపోట్లు వస్తున్నాయి. ఉన్న చోటనే కుప్పకూలి ప్రాణాలు విడుస్తున్నారు. ఈ మధ్య చాలా మంది సెలబ్రిటీలు..సామాన్యులు చాలా మంది గుండెపోటుతో చనిపోయిన వాళ్లే ఉన్నారు. అందుకే ఎలాంటి చిన్న హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా వెంటనే అలర్ట్ కావాలంటున్నారు డాక్టర్లు..నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లిచుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు.

యంగ్ ఏజ్​లో ఏ ప్రాబ్లమ్ వచ్చినా బాడీ దాన్ని అధిగమించగలుగుతుంది. ఏమాత్రం హెల్త్ ఇష్యూస్ ఉన్నా.. నిర్లక్ష్యం చేయకూడదు. చిన్నప్పుడు ఫిట్స్ వచ్చింది.. ఆ తర్వాత రాలేదు కదా అని కొందరు. ఆస్తమా పెద్దయ్యాక లేదు కదా అని మరికొందరు. తినకపోవడం వల్ల కళ్లు తిరిగాయి.. తింటే సెట్ అవుతుందని, అప్పుడప్పుడు వచ్చే తలనొప్పే పెద్దగా పట్టించుకో నక్కర్లేదని అనుకుంటారు. అలాగే, ఎక్కువగా ఆయాస పడడం, ఇంతకుముందు చేసిన పని ఇప్పుడు చేయలేకపోవడం, అనూహ్యంగా బరువు పెరగడం లేదా తగ్గడం వంటి కొన్ని సమస్యలను చిన్నవే అనుకుని పెద్దగా పట్టించుకోరు.కాబట్టి బేసిక్ చెకప్​లు చేయించుకోవడం తప్పనిసరి. హార్ట్, బ్రెయిన్​కి సంబంధించిన సమస్యలను వెంటనే టెస్ట్ చేయించుకోవాలి.

ప్రతి సడెన్ డెత్.. కార్డియాక్ డెత్ కాదు.. గుండెలో కొలెస్ట్రాల్ బ్లాకేజీ ఉండడం వల్ల కావొచ్చు. కొన్ని గుర్తించలేని వ్యాధులు లేదా అనారోగ్య సమస్యల వల్ల కూడా ఇలా జరగొచ్చు. కొన్ని పరిస్థితుల్లో రక్తనాళాలు చీలిపోవడం, గుండెలో రంధ్రం ఉన్నా గుర్తించకపోవడం, గుండె జబ్బు ముదిరిపోవడం వంటి కండిషన్స్​లో సడెన్ డెత్ అయ్యే ప్రమాదం ఉంటుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story