డేంజర్ ఫుడ్స్ ఇవే..

High BP Alert: ఈ రోజుల్లో రక్తపోటు లేదా హై బీపీ అనేది ఒక సైలెంట్ కిల్లర్ లా మారిపోయింది. మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. అయితే మనకు తెలియకుండానే మనం రోజూ తినే కొన్ని పదార్థాలు మన బీపీని డేంజర్ జోన్‌లోకి నెట్టేస్తున్నాయి.

ఉప్పు! రక్తపోటుకు ప్రధాన శత్రువు సోడియం. మనం ఎంతో ఇష్టంగా తినే ఊరగాయలు, ఆవకాయల్లో నిల్వ ఉండటం కోసం ఉప్పును విపరీతంగా వాడుతారు. ఒక్క ముక్క ఊరగాయ తిన్నా, అది మీ శరీరంలో సోడియం స్థాయిని అకస్మాత్తుగా పెంచేస్తుంది. అలాగే, అన్నంలో పైన ఉప్పు చల్లుకోవడం ఇప్పుడే ఆపేయండి. అతిగా మద్యం సేవించడం వల్ల రక్తనాళాలు దెబ్బతిని బీపీ పెరుగుతుంది. అంతేకాకుండా, ఇది బీపీ మందుల పనితీరును కూడా తగ్గిస్తుంది.

ప్యాక్ చేసిన ఆహారాలు:

ప్యాక్ చేసిన చిరుతిళ్లు. చిప్స్, కుర్కురే, సాల్టెడ్ నట్స్.. ఇవి చూట్టానికి చిన్నవే కానీ వీటిలో ఉండే ఉప్పు మోతాదు చాలా ఎక్కువ. అలాగే, టిన్లలో వచ్చే సూప్‌లు లేదా రెడీ-టు-ఈట్ ప్యాకెట్లలో రుచి కోసం 'మోనో సోడియం గ్లుటామేట్' వంటి పదార్థాలను కలుపుతారు. ఇవి మీ రక్తనాళాలపై విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తాయి."

తీపి,కెఫీన్:

కేవలం ఉప్పే కాదు.. చక్కెర కూడా ప్రమాదకరమే! అతిగా తీపి పదార్థాలు తీసుకోవడం వల్ల బరువు పెరిగి, అది బీపీకి దారితీస్తుంది. ఇక కాఫీ, టీలలో ఉండే కెఫీన్ గురించి జాగ్రత్త! ఒకేసారి ఎక్కువ కప్పుల కాఫీ తాగడం వల్ల మీ గుండె వేగం పెరిగి, రక్తపోటు ఒక్కసారిగా షూట్-అప్ అయ్యే అవకాశం ఉంది.

గుర్తుంచుకోండి.. రుచి కోసం మనం చేసే చిన్న చిన్న తప్పులు, ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదం ఉంది. ప్యాక్ చేసిన ఫుడ్స్ కొనే ముందు లేబుల్ చెక్ చేయండి, తాజా పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story