Protein Boost: జిమ్‌కు వెళ్తున్నారా..? ప్రోటీన్ కోసం ఇవి తినండి
ప్రోటీన్ కోసం ఇవి తినండి

Protein Boost: నేటి యువత తమ ఆరోగ్యం, శారీరక సౌందర్యాన్ని కాపాడుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే నేడు చాలా మంది జిమ్‌కు వెళ్తున్నారు. కానీ భారీ వ్యాయామాలు చేయడంతో పాటు మీరు మీ ఆహారం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. శరీరానికి అధిక మొత్తంలో ప్రోటీన్ అవసరం.
కండరాలు, ఎంజైమ్‌లను నిర్మించడంలో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. జిమ్‌లో తీవ్రమైన వ్యాయామాలు చేస్తున్నప్పుడు.. మీ కండరాలు ఒత్తిడికి గురై చీలిపోవచ్చు. ఈ సమస్యలను సరిదిద్దడానికి ప్రోటీన్ సహాయపడుతుంది. కాబట్టి, జిమ్‌కు వెళ్లేవారు తమ ఆహారంలో ఎక్కువ ప్రోటీన్‌ను చేర్చుకోవడానికి ప్రయత్నించాలి. దీనికోసం ఏ వంటకాలను ఆహారంలో చేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటాయో చూద్దాం.
చనా మసాలా:
చనా మసాలా ఉత్తర భారతదేశంలోని ప్రధాన వంటకాల్లో ఒకటి. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ప్రోటీన్ అధికంగా ఉంటుంది. 100 గ్రాముల ఉడికించిన చిక్‌పీస్‌లో దాదాపు 19 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
సోయా:
సోయా చాలా రుచికరమైన ఆహారం. దీనిని ప్రోటీన్ స్టోర్‌హౌస్ అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యంత విస్తృతంగా వినియోగించబడే పప్పుదినుసు. సోయాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఉల్లిపాయలు, టమోటాలు, సుగంధ ద్రవ్యాలతో వండినప్పుడు, అది రుచి ఆరోగ్య ప్రయోజనాలలో అద్భుతంగా ఉంటుంది.
మూంగ్ దాల్ చీలా:
ఇది ఆరోగ్యకరమైన, అధిక ప్రోటీన్ కలిగిన వంటకం. ఇది బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది. దీన్ని నానబెట్టిన పప్పు, పచ్చిమిర్చి, అల్లంతో వండి, సుగంధ ద్రవ్యాలతో కలిపి, వేడి తవా మీద తయారుచేస్తే చాలా రుచిగా ఉంటుంది.
ఎగ్ కర్రీ:
జిమ్‌కి వెళ్లేవారికి గుడ్లు తప్పనిసరిగా ఉండాలి. ఉడికించిన గుడ్లను తినడం బోరింగ్‌గా అనిపించినప్పటికీ, వాటిని కారంగా ఉండే కూరలో కలిపి తినడం ఇంకా మంచిది. ఒక గుడ్డు మీకు దాదాపు 6 గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
