Brain Function: ప్రమాదం జరిగేటప్పుడు మెదడు ఎలా పనిచేస్తుంది?
మెదడు ఎలా పనిచేస్తుంది?

Brain Function: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎంతోమంది కలలు ఈ ప్రమాదంతో ఛిద్రమయ్యాయి. ఈ విషాదం భారత చరిత్రలో అత్యంత దారుణమైన విమాన ప్రమాదంగా నిలిచింది. విమానంలో ఉన్నవారు తమ చివరి క్షణాలను ఎలా గడిపారు? విమానం కూలిపోయినప్పుడు వారు స్పృహలో ఉన్నారా లేదా వంటి వివిధ ప్రశ్నలకు సమాధానాల కోసం వారు వెతుకుతున్నారు.
అటువంటి గందరగోళాన్ని తొలగించడానికి, కొంతమంది నాడీ శాస్త్రవేత్తలు, మనస్తత్వవేత్తలు కొన్ని విషయాలను ప్రస్తావిస్తున్నారు. చివరి క్షణాల్లో మెదడు ఎలా పనిచేస్తుంది? చివరి దశలో ఒక వ్యక్తి ఆలోచనలు ఎలా ఉంటాయనే దాని గురించి వివరిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఒక వ్యక్తి ఎలా ప్రవర్తించవచ్చో, ఆ సమయంలో శరీరంలో ఎలాంటి మార్పులు సంభవించవచ్చో కూడా చెబుతున్నారు.
చివరి సెకన్లలో మెదడులో ఏమి జరుగుతుందంటే..
ప్రమాదం సంభవించినిప్పుడు మెదడు మనుగడ గురించి ఆలోచిస్తుందని నిపుణులు అంటున్నారు. అప్పుడు కలిగే భయం వల్ల మానవ శరీరం 'అడ్రినల్' అనే హార్మోన్ విడుదల అవుతుంది. ‘‘ప్రమాదానికి ముందు చివరి సెకన్లలో, మానవ శరీరం తీవ్ర ఒత్తిడికి లోనవుతుంది. హృదయ స్పందన రేటు పెరుగుతుంది. శ్వాస వేగవంతం అవుతుంది. కండరాలు బిగుసుకుపోతాయి’’ అని నిపుణులు చెబుతున్నారు.
ఈ సమయంలో వ్యక్తులు స్పృహలో ఉన్నారా?
విమాన ప్రమాదం జరిగినప్పుడు.. మెదడు తీవ్రమైన శారీరక గాయానికి గురవుతుంది. ఈ ప్రభావం విమానం వేగం, విమానంలో వ్యక్తి స్థానం, ఆ వ్యక్తి సీట్ బెల్టులు వంటి ఏవైనా భద్రతా పరికరాలను ధరించాడా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మన మెదడు సాధారణంగా బలహీనంగా ఉంటుంది. అటువంటి సందర్భంలో, పుర్రె పగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని వలన వ్యక్తి శరీరానికి తీవ్రమైన గాయాలు అయ్యే ప్రమాదం పెరుగుతుంది.
ఇక విమానం మంటల్లో చిక్కుకునే ముందు స్పృహ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఎత్తు, వేగం మెదడు, మానవ శరీరంలోని ఇతర భాగాలకు భారీ గాయాన్ని కలిగిస్తాయి. చివరి క్షణంలో వారు తమ స్పృహను కోల్పోతున్నారు. ఇదంతా సెకన్లలో జరిగిపోతుంది కాబట్టి, స్పృహ కోల్పోవడానికి ఒక్క క్షణం సరిపోతుందని తెలిపారు.
