పీసీఓఎస్ ఎన్ని రకాలంటే?

Types of PCOS : ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా మహిళల్లో పీసీఓఎస్ సమస్య ఒక ప్రధాన ఆరోగ్య సవాలుగా మారింది. అయితే ఈ సమస్య ఉన్న అందరిలోనూ లక్షణాలు ఒకేలా ఉండవని, దీని తీవ్రతను బట్టి ప్రధానంగా నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో 'టైప్-A' లేదా క్లాసిక్ పీసీఓఎస్ అనేది అత్యంత తీవ్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇందులో మహిళల శరీరంలో మగ హార్మోన్లు (ఆండ్రోజెన్లు) అధికంగా ఉండటంతో పాటు, అండం విడుదల కాకపోవడం, అండాశయాల్లో చిన్న చిన్న తిత్తులు ఏర్పడటం వంటి మూడు ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి. ఇక 'టైప్-B' విషయానికి వస్తే, ఇందులో మగ హార్మోన్లు ఎక్కువగా ఉండి నెలసరి అస్తవ్యస్తంగా మారుతుంది కానీ, అండాశయాల్లో తిత్తులు ఉండకపోవచ్చు. మరోవైపు 'టైప్-C' అనేది కొంచెం భిన్నంగా ఉంటుంది. దీనిని ఓవులేటరీ పీసీఓఎస్ అంటారు. ఇందులో మహిళల్లో మగ హార్మోన్లు, అండాశయాల్లో తిత్తులు ఉన్నప్పటికీ, నెలసరి మాత్రం ప్రతి నెలా సక్రమంగానే వస్తుంటుంది. చివరిగా 'టైప్-D' రకంలో నెలసరి సరిగా రాకపోవడం, ఉపిరితిత్తులు ఏర్పడటం వంటి సమస్యలు ఉన్నప్పటికీ, మగ హార్మోన్ల ప్రభావం పెద్దగా కనిపించదు. ఈ హార్మోన్ల అసమతుల్యత కారణంగా జుట్టు రాలడం, ముఖంపై మొటిమలు, అనవసరమైన రోమాలు పెరగడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే లక్షణాలను బట్టి అది ఏ రకమైన పీసీఓఎస్ అని గుర్తించి, దానికి అనుగుణంగా ఆహార నియమాలు పాటిస్తూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఈ సమస్యను నియంత్రించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story