Fiber Should People of Different Ages Consume Daily: రోజుకు ఏ వయసు వాళ్లు.. ఎంత ఫైబర్ తీసుకోవాలి.?
ఎంత ఫైబర్ తీసుకోవాలి.?

Fiber Should People of Different Ages Consume Daily: ఫైబర్ (పీచు పదార్థం) అనేది మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి , కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది.ఆడ,మగ వంటి అంశాలపై ఆధారపడి రోజుకు తీసుకోవాల్సిన ఫైబర్ పరిమాణం మారుతుంది. ఎత్తు, బరువు, అనారోగ్య సమస్యలు, రోజువారీ ఆహారపు అలవాట్లను బట్టి ఎంత ఫైబర్ తీసుకోవాలనేది వైద్యులు సూచిస్తారు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకునేటప్పుడు, తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. లేదంటే మలబద్ధకం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
రోజుకు ఎంత ఫైబర్ తీసుకోవాలి?
సగటు రోజువారీ అవసరాలకోసం పురుషులు 30 గ్రాములు, స్త్రీలు 25 గ్రాములు, సాధారణ సగటు28 గ్రాములు వరకు తీసుకోవాలి. 2-5 ఏళ్ల పిల్లలు సుమారు 15 గ్రాములు, 5-11 ఏళ్ల పిల్లలు సుమారు 20 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి. చాలా మంది వ్యక్తులు ఈ సిఫార్సు చేయబడిన పరిమాణంలో సగం మాత్రమే తీసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా వ్యక్తికి ఉన్న ఆరోగ్య సమస్యలు,డాక్టర్ల సూచనల మేరకు తీసుకుంటే బెటర్.
ఫైబర్ ఎలా పొందాలి?
ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు:
పండ్లు: యాపిల్, బత్తాయి (సిట్రస్ పండ్లు), అరటిపండు, జామ.
కూరగాయలు: క్యారెట్లు, కాలిఫ్లవర్, క్యాబేజీ, పాలకూర, తోటకూర.
ధాన్యాలు: ఓట్స్, బార్లీ, బ్రౌన్ రైస్, క్వినోవా.
పప్పులు/గింజలు: నల్ల శనగలు, పచ్చి బఠానీలు, బాదంపప్పు, వాల్‌నట్స్, గుమ్మడి విత్తనాలు, అవిసె గింజలు, చియా విత్తనాలు.

