ఆహారం ఎంతవరకు సేఫ్టీ..?

Health:కూటి కోసం కోటి తిప్పలు అంటుంటారు. మరి అన్ని ఇబ్బందు పడి మనం తినే ఆహారం మంచిదేనా? ఎంతవరకు సేఫ్ తెలుసా..? ఈ ప్రపంచంలో ప్రతీ పదిమందిలో ఒకరు సేఫ్ ఫుడ్ తీసుకోకనే జబ్బుల బారిన పడుతున్నారని డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్ వెల్లడించింది. కాబట్టి ఫుడ్ సేఫ్టీ అన్నది మన బాధ్యత. ఆహార భద్రత , జాగ్రత్త ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ప్రతియేటా ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం పాటిస్తారు.
తినే తిండి విషయంలో సింపుల్ లాజిక్ ఏంటంటే..మంచి తిండి తింటే ఆరోగ్యంగా ఉంటాం. తినేదాంట్లో మంచి పోషకాలు ఉంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ పెరిగితే వైరస్, బ్యాక్టీరియాలను ఎదిరించొచ్చు.కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలావరకు మనం సేఫ్ ఫుడ్ తీసుకుంటున్నట్టే. ఆహార భద్రత, పరిశుభ్రత ప్రతి ఒక్కరి జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి. మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇవాళ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా మనం తీసుకోవాల్సిన భద్రతా చిట్కాలు తెలుసుకుందాం.
భద్రత పాటించండి ఇలా
కూరగాయాలు కట్ చేసే చాకులు నేల, ప్లేట్లు ఏవైనా సరే శుభ్రంగా కడగాలి.
చేతులు, పాత్రలు, మనం నివాసించే ప్రాంతాలను నిత్యం శుభ్రం చేసుకోవాలి.
మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులను బాగా ఉడికించి తినాలి.
ఏదైనా ప్యాక్డ్ ఆహార పదార్థాలు వినియోగిస్తున్నపుడు లేబుల్స్ చెక్ చేసుకోవాలి. గడువు ముగిసిన ఆహారం తీసుకోవద్దు.
బ్యాక్టీరియా పెరుగుదలను నివారించేందుకు మిగిలిపోయిన ఆహారపదార్థాలను 2గంటల్లోపు ఫ్రిజ్ లో నిల్వ చేయాలి.
వంట చేసేముందు చేతులను ఇరవై సెకండ్లపాటు శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు, వంట చేస్తున్నపుడు ఎప్పటికప్పుడు చేతులు కడుగుతూనే ఉండాలి.
