Dark Circles Under the Eyes: కళ్ల కింద నల్లటి డార్క్ సర్కిల్స్ పోవాలంటే
డార్క్ సర్కిల్స్ పోవాలంటే

Dark Circles Under the Eyes: కళ్ల కింద డార్క్ సర్కిల్స్ అనేక కారణాల వల్ల వస్తాయి. నిద్రలేమి, ఒత్తిడి, పోషకాహార లోపం, వంశపారంపర్యంగా రావడం, ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు పనిచేయడం వంటివి ఇందులో కొన్ని. ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. ప్రతిరోజు 7-8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. సరైన నిద్ర లేకపోవడం వల్ల రక్త ప్రసరణ తగ్గి, చర్మం పాలిపోయి నల్లటి మరకలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. సరిపడా నీరు తాగడం వల్ల శరీరంలో తేమ తగ్గిపోకుండా ఉంటుంది. విటమిన్ కె, సి, ఇ, ఐరన్ సమృద్ధిగా ఉండే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, బీట్‌రూట్ వంటివి తీసుకోవడం మంచిది. కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ ఎక్కువ సమయం వాడేటప్పుడు ప్రతి గంటకు 10-15 నిమిషాల విరామం తీసుకోండి. ఇది కంటిపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒక బంగాళాదుంపను సన్నని ముక్కలుగా కోసి, వాటిని ఫ్రిజ్‌లో చల్లబరిచి, కళ్లపై 15-20 నిమిషాలు ఉంచండి. బంగాళాదుంపలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు నల్లటి మరకలను తగ్గిస్తాయి. దోసకాయ ముక్కలను కూడా ఫ్రిజ్‌లో చల్లబరిచి కళ్లపై ఉంచవచ్చు. ఇది చర్మాన్ని చల్లబరిచి, అలసటను తగ్గిస్తుంది. ఉపయోగించిన గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ బ్యాగ్‌లను ఫ్రిజ్‌లో పెట్టి చల్లబరచండి. తర్వాత వాటిని కళ్లపై 10-15 నిమిషాలు ఉంచండి. టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, కెఫిన్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. రాత్రి పడుకునే ముందు కళ్ల కింద ఒక చుక్క బాదం నూనెతో సున్నితంగా మసాజ్ చేయండి. బాదం నూనె చర్మానికి తేమను అందించి, నలుపును తగ్గిస్తుంది. దూదిని గులాబీ నీటిలో ముంచి, కళ్లపై ఉంచండి. ఇది చర్మాన్ని తాజాగా ఉంచి, నల్లటి వలయాలను పోగొడుతుంది. ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. అయితే, సమస్య తీవ్రంగా ఉంటే చర్మ వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
