స్నానం చేయవచ్చా.?

Bathe Immediately After Eating: తిన్న వెంటనే స్నానం చేసే అలవాటు ఉంటే, అది మీ ఆరోగ్యానికి మంచిది కాదని ఆయుర్వేదం, ఆధునిక వైద్య శాస్త్రం రెండూ చెబుతున్నాయి. మనం భోజనం చేసిన తర్వాత, ఆహారాన్ని అరిగించడానికి మన శరీరంలోని రక్త ప్రసరణ అంతా జీర్ణ వ్యవస్థ (Digestive System) వైపు మళ్లుతుంది. దీనివల్ల జీర్ణకోశంలో వేడి పెరుగుతుంది.

మీరు తిన్న వెంటనే స్నానం చేసినప్పుడు, శరీరం తన ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి రక్త ప్రసరణను చర్మం వైపు మళ్లిస్తుంది. దీనివల్ల జీర్ణ ప్రక్రియకు అందాల్సిన రక్త ప్రసరణ తగ్గి, తిన్న ఆహారం సరిగ్గా అరగదు.

జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం , వికారం వంటి సమస్యలు వస్తాయి.

ఎంత సమయం గ్యాప్ ఇవ్వాలి?

కనీసం 45 నిమిషాల నుండి 1 గంట వరకు వేచి చూసిన తర్వాతే స్నానం చేయడం ఉత్తమం. దీనివల్ల శరీరం తన సహజసిద్ధమైన జీర్ణ ప్రక్రియను ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేసుకోగలదు.

ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో స్నానం చేయాల్సి వస్తే, చల్లటి నీటి కంటే గోరువెచ్చని నీటిని ఎంచుకోవడం కొంత మేలు . స్నానం చేసిన తర్వాత తినడం వల్ల శరీరం తాజాగా ఉంటుంది.రక్త ప్రసరణ సాధారణ స్థితికి వస్తుంది కాబట్టి జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story