తెలుసుకోవాల్సిన నిజాలు ఇవే..

Red Wine Really Good: చాలా మందికి రెడ్ వైన్ గురించి తెలిసిందే. పండ్ల నుండి తయారవుతుంది కాబట్టి, ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని, ముఖ్యంగా గుండె, మెదడు ఆరోగ్యానికి మంచిదని తరచుగా వినిపిస్తుంది. అయితే మనం ఎప్పుడైనా ఆలోచించామా.. ? ఇది నిజంగా మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందా? ఈ విషయంపై పూర్తి వివరాలను తెలుసుకుందాం.

నిజంగా రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిదేనా?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రెడ్ వైన్ లేదా వైన్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పడానికి కొన్ని ఆధారం ఉన్నప్పటికీ, అది కేవలం మితంగా తీసుకుంటేనే! అధికంగా తీసుకుంటే, అమృతం కూడా విషపూరితం అవుతుంది అన్నట్లుగా, మద్యం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

రెడ్ వైన్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె, మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయని నమ్ముతారు. అయినప్పటికీ మద్యం సేవించడం కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది, కాబట్టి చాలా తక్కువ మోతాదులో తాగడం మంచిది.

గుండె ఆరోగ్యానికి వైన్ మంచిదా..?

ఆరోగ్య నిపుణులు ప్రకారం.. వైన్ గుండెకు మంచిదని చెప్పబడుతున్నప్పటికీ, ఆల్కహాల్ ఆరోగ్యకరమైన పానీయం అని ఎప్పుడూ నిరూపించబడలేదు. రెడ్ వైన్ అధికంగా తాగడం ఏమాత్రం ప్రయోజనకరం కాదు.

రెస్వెరాట్రాల్' కోసం ప్రత్యామ్నాయాలు

రెడ్ వైన్‌లో ఉండే ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్లలో ఒకటి రెస్వెరాట్రాల్. అయితే, ఈ అవసరమైన రెస్వెరాట్రాల్‌ను రెడ్ వైన్ నుంచే పొందాల్సిన అవసరం లేదు. మీ రోజువారీ ఆహారంలో పండ్లు, ద్రాక్ష, గింజలను చేర్చుకోవడం ద్వారా కూడా మీరు ఈ పోషకాన్ని సులభంగా పొందవచ్చు. కాబట్టి ఆరోగ్య ప్రయోజనాల కోసం కేవలం వైన్‌పై ఆధారపడకుండా, పండ్లు, కూరగాయలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం ఉత్తమం.

స్వీట్ వైన్ గురించి అపోహలు

సాధారణంగా తాగేవారిలో స్వీట్ వైన్ చౌకగా ఉంటుందనే అపోహ ఉంది. కానీ ఇది నిజం కాదు. ప్రపంచంలో అనేక రకాల స్వీట్ వైన్లు ఉన్నాయి. వాటిలో కొన్ని చాలా ఖరీదైనవి. ఫ్రాన్స్, హంగేరీ వంటి దేశాల నుండి వచ్చే కొన్ని ప్రత్యేకమైన స్వీట్ వైన్లు వాటి నాణ్యత కారణంగా అధిక ధరను కలిగి ఉంటాయి.

రెడ్ వైన్ మితంగా తీసుకుంటే గుండెకు కొంత మేలు చేయవచ్చు అనే అభిప్రాయం ఉన్నప్పటికీ, దానిని పూర్తిగా ఆరోగ్యకరమైన పానీయంగా పరిగణించలేము. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం, పండ్లు, ద్రాక్ష, గింజలతో కూడిన సంతులిత ఆహారం, క్రమం తప్పని వ్యాయామం ఉత్తమ మార్గాలు. ఎటువంటి పరిస్థితులలోనైనా, మద్యం వినియోగం పరిమితంగా ఉండటం చాలా అవసరం.

PolitEnt Media

PolitEnt Media

Next Story