Stress Causing Irregular Periods: మనం రోజువారీ జీవితంలో ఎదుర్కొనే తీవ్రమైన ఒత్తిడి కేవలం మన మనసుపైనే కాకుండా, శారీరక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మహిళల్లో వచ్చే హార్మోన్ల అసమతుల్యతకు, క్రమరహిత నెలసరికి (Irregular Periods) ఒత్తిడి ప్రధాన కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మానసిక ఆందోళన,ఒత్తిడి పెరిగినప్పుడు, శరీరం కార్టిసాల్ అనే హార్మోన్‌ను ఎక్కువగా విడుదల చేస్తుంది. ఇది ప్రత్యుత్పత్తి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీనివల్ల పీరియడ్స్ సమయానికి రాకపోవడం, రక్తస్రావం చాలా ఎక్కువగా లేదా తక్కువగా కావడం, విపరీతమైన కడుపునొప్పి, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు ఎదురవుతాయి. చాలా మంది దీనిని సాధారణ సమస్యగా భావించి లైట్ తీసుకుంటారు, కానీ ఇది దీర్ఘకాలంలో హార్మోన్ల రుగ్మతలకు దారితీస్తుందని గైనకాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు.

ఈ సమస్య నుంచి బయటపడాలంటే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, యోగా లేదా ధ్యానం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడం, పౌష్టికాహారం తీసుకోవడం , తగినంత నిద్రపోవడం చాలా అవసరం. నెలసరిలో ఏవైనా దీర్ఘకాలిక మార్పులు కనిపిస్తే వెంటనే గైనకాలజి సంప్రదించి తగిన వైద్య సలహా తీసుకోవడం ఉత్తమం.

PolitEnt Media

PolitEnt Media

Next Story