నిపుణులు సూచిస్తున్న 6 కీలక అలవాట్లు..

Kidney Health: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి కారణంగా కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి, రక్తాన్ని శుద్ధి చేసే కీలకమైన కిడ్నీలను కాపాడుకోవడం మన ప్రాథమిక బాధ్యత. ఈ నేపథ్యంలో వైద్య నిపుణులు కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పలు కీలక సూచనలు చేశారు.

కిడ్నీలను సురక్షితంగా ఉంచే మార్గాలు..

ధారాళంగా నీరు త్రాగాలి: శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపడానికి నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. తగినంత నీరు త్రాగడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి తగ్గి, మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది.

ఉప్పు వాడకం తగ్గించండి: ఆహారంలో అధిక ఉప్పు రక్తపోటును పెంచుతుంది. ఇది క్రమంగా కిడ్నీల దెబ్బతినడానికి దారితీస్తుంది. కాబట్టి రోజువారీ ఉప్పు తీసుకోవడంపై నియంత్రణ అవసరం.

షుగర్, బీపీ అదుపులో ఉండాలి: మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు వాటిని నిరంతరం పర్యవేక్షించుకోవాలి. ఈ రెండు సమస్యలు కిడ్నీ ఫెయిల్యూర్ కు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.

క్రమం తప్పని వ్యాయామం: రోజుకు కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయడం వల్ల శరీరం ఫిట్‌గా ఉండటమే కాకుండా, కిడ్నీ వ్యాధుల ముప్పు గణనీయంగా తగ్గుతుంది.

పెయిన్ కిల్లర్ల విషయంలో జాగ్రత్త: వైద్యుల సలహా లేకుండా తరచూ నొప్పి నివారణ మందులు వాడటం కిడ్నీలకు అత్యంత ప్రమాదకరం. ఇవి దీర్ఘకాలంలో కిడ్నీ పనితీరును పూర్తిగా దెబ్బతీసే అవకాశం ఉంది.

రెగ్యులర్ హెల్త్ చెకప్స్: 35 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కనీసం ఏడాదికి ఒకసారైనా పూర్తి శరీర ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ హిమాన్షు సూచిస్తున్నారు. దీనివల్ల సమస్య ఏదైనా ఉంటే ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవచ్చు.

ఆరోగ్యకరమైన జీవనశైలి, చిన్నపాటి జాగ్రత్తలతో కిడ్నీ వ్యాధులను దరిచేరకుండా చూసుకోవచ్చు. కిడ్నీలు దెబ్బతిన్న తర్వాత బాధపడటం కంటే, రాకుండా జాగ్రత్త పడటమే ఉత్తమ మార్గం.

PolitEnt Media

PolitEnt Media

Next Story