ప్రేగు ఆరోగ్యాన్ని దెబ్బతీసే నిద్రలేమి

Lack of Sleep Poses a Serious Threat to Digestion: నిద్రలేమి ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. నిద్ర లేకపోవడం వల్ల మన శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒక వ్యక్తి రోజుకు కనీసం ఏడు గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. టీనేజర్లు, పిల్లలకైతే ఇది 12 గంటల వరకు పెరుగుతుంది. జ్ఞాపకశక్తి కోల్పోవడం నుండి గుండె ఆరోగ్యం వరకు ప్రతిదానిలోనూ నిద్ర లేమి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ముఖ్యంగా నిద్ర లేకపోవడం వల్ల మీ జీర్ణవ్యవస్థ మలబద్ధకం, ఉబ్బరం లేదా ఇతర అసౌకర్యాలకు గురవుతుంది.

జీర్ణవ్యవస్థపై నిద్రలేమి ప్రభావం

జీర్ణక్రియ, పేగు ఆరోగ్యం సరైన నిద్ర ఉన్నప్పుడే బాగా పనిచేస్తాయి. నిద్ర లేకపోవడం వల్ల మలబద్ధకం తీవ్రమవుతుంది. మన పేగు దాని స్వంత సిర్కాడియన్ నమూనాలను కలిగి ఉంటుందని నిపుణులు తెలిపారు. నిజానికి జీర్ణవ్యవస్థలోని ప్రతి కణానికి దాని స్వంత సమయం ఉంటుంది. ఇది మెదడుకు అనుసంధానించబడి ఉంటుంది. కాబట్టి మీకు నిద్ర లేనప్పుడు, ఈ సమయాలన్నీ మారిపోతాయి, దీని వలన జీర్ణక్రియ దెబ్బతింటుంది.

పేగు ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్య విషయాలు

డాక్టర్ కరణ్ రాజన్ ప్రకారం.. రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల మధ్య నిద్రపోయేవారికి పేగు ఆరోగ్యం చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల మలం పొడిబారడం, మలబద్ధకం వస్తుంది. అలాగే రాత్రి ఆలస్యంగా తినే అలవాటును పూర్తిగా మానుకోవాలి. ఈ అలవాటు మీ పేగులు, కడుపును అనారోగ్యకరంగా మారుస్తుంది. మీరు ఉదయం నిద్ర లేచినప్పుడు, ఉబ్బరం, గ్యాస్, ఆమ్లత్వం వంటి సమస్యలను ఎదుర్కొంటారు.

మెరుగైన పేగు ఆరోగ్యం కోసం ఆహార నియమాలు

మంచి నిద్రతో పాటు పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు, జీర్ణక్రియకు సహాయపడతాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి. పెరుగు మజ్జిగ, ఇడ్లీ, దోస వంటి పులియబెట్టిన ప్రోబయోటిక్ ఆహారాలు మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు తోడ్పడి ప్రేగులకు మేలు చేస్తాయి. అదనంగా వెల్లుల్లి, ఉల్లిపాయలు, అరటిపండ్లు, ఓట్స్ వంటి ప్రీబయోటిక్ ఆహారాలు మంచి బ్యాక్టీరియా పెరగడానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story