అలాగే వదిలేస్తున్నారా?

Leaving Unwashed Utensils: చాలామంది రాత్రి భోజనం చేసిన తర్వాత బద్ధకంతోనో లేదా అలసట వల్లనో ఎంగిలి పాత్రలను సింకులోనే వదిలేస్తుంటారు. "రేపు పొద్దున్నే తోముకోవచ్చులే" అని వదిలేసే ఈ చిన్న అలవాటు మీ ఇంట్లోకి దరిద్రాన్ని ఆహ్వానిస్తుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, మనం ఉదయం నిద్రలేవగానే పవిత్రమైన లేదా శుభ్రమైన వస్తువులను చూడాలి. కానీ, వంటగదిలో పేరుకుపోయిన మురికి పాత్రలను చూడటం వల్ల ఆ రోజంతా ప్రతికూల శక్తి (Negative Energy) ప్రభావం చూపుతుంది. ఇది మన మనసుపై, చేసే పనులపై చెడు ప్రభావం చూపిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి అక్కడ కొలువై ఉంటుంది. ముఖ్యంగా వంటగదిని 'అన్నపూర్ణేశ్వరి' నిలయంగా భావిస్తారు. రాత్రిపూట ఎంగిలి పాత్రలను వంటగదిలో అలాగే వదిలేయడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదని, తద్వారా ఆర్థిక ఇబ్బందులు, పేదరికం వచ్చే అవకాశం ఉందని పెద్దలు హెచ్చరిస్తున్నారు. కేవలం వాస్తు పరంగానే కాకుండా, ఆరోగ్య పరంగా కూడా రాత్రి అంట్లు తోమకుండా వదిలేయడం మంచిది కాదు. ఎంగిలి పాత్రలపై రాత్రంతా బ్యాక్టీరియా, కీటకాలు చేరే అవకాశం ఉంది. దీనివల్ల వంటగది అపరిశుభ్రంగా మారి రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. రాత్రి భోజనం పూర్తయిన వెంటనే అంట్లు తోముకోవడం ఉత్తమం. ఒకవేళ అంట్లు తోమడం సాధ్యం కాకపోతే, కనీసం వాటిని నీళ్లతో కడిగి ఎంగిలి లేకుండా పక్కన పెట్టుకోవాలి. పడుకునే ముందు వంటగది గట్టును శుభ్రం చేసుకోవడం వల్ల ఇంట్లో ప్రశాంతత, ఐశ్వర్యం పెరుగుతాయి. వంటగదిని శుభ్రంగా ఉంచుకోవడం అంటే కేవలం ఇల్లు బాగుండటం మాత్రమే కాదు, అది మీ కుటుంబ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని గుర్తించుకోండి.

PolitEnt Media

PolitEnt Media

Next Story