Which Side Sleeping Is Better for Health: ఎడమ లేదా కుడి.. ఏ వైపు పడుకోవడం ఆరోగ్యానికి మంచిది..?
ఏ వైపు పడుకోవడం ఆరోగ్యానికి మంచిది..?

Which Side Sleeping Is Better for Health: మన శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో, నిద్ర కూడా అంతే ముఖ్యం. చాలా మందికి తమకు నచ్చిన విధంగా, సుఖంగా అనిపించిన వైపు తిరిగి పడుకునే అలవాటు ఉంటుంది. కానీ మనం నిద్రించే విధానం మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని చాలా మందికి తెలియదు. మీరు సరైన భంగిమలో నిద్రించకపోతే, జీర్ణ సమస్యలు సహా అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అందుకే నిపుణులు సూచించే ఉత్తమ నిద్ర భంగిమ ఏమిటి..? దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎడమవైపు తిరిగి పడుకోవడం ఎందుకు బెస్ట్?
నిద్రించేటప్పుడు ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల శరీరానికి అనేక అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు, ఆయుర్వేదం కూడా చెబుతున్నాయి.
జీర్ణక్రియ మెరుగు: ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది. ఆహారం పేగులలో వేగంగా కదులుతుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను నివారిస్తుంది.
గుండెకు మేలు: మన గుండె శరీరంలో ఎడమ వైపున ఉంటుంది. ఎడమవైపు పడుకోవడం వల్ల గుండెకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
వెన్నునొప్పికి ఉపశమనం: నేటి బిజీ లైఫ్‌లో ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారికి వెన్నునొప్పి సర్వసాధారణం. అలాంటివారు ఎడమవైపు పడుకోవడం అలవాటు చేసుకుంటే, నొప్పి నుంచి ఉపశమనం లభించవచ్చు.
శరీర అవయవాల పనితీరు: ఈ భంగిమ మన ప్రేగులు, ప్రేగు కదలికలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, మొత్తం శరీరం యొక్క అంతర్గత అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.
ఈ అలవాటు ఉంటే మార్చుకోండి!
మీకు కుడి వైపు తిరిగి పడుకునే అలవాటు లేదా బోర్లా పడుకునే అలవాటు ఉంటే, వెంటనే దానిని మార్చుకోవడం మంచిది. ఎందుకంటే ఈ భంగిమల్లో నిద్రించడం వల్ల మీ నిద్రతో పాటు శరీర అవయవాల పనితీరు కూడా ప్రతికూలంగా ప్రభావితమవుతుంది.
రోజువారీ ఒత్తిడి , ఆహారపు అలవాట్లలోని మార్పులు మన నిద్రను ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి, ఆరోగ్యంగా ఉండటానికిఎడమ వైపు పడుకునే అలవాటు చేసుకోవడం ద్వారా చక్కటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
