Low Sperm Count: నేటి ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తగ్గడం అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. అయితే, కంగారుపడాల్సిన పనిలేదు. మన దైనందిన జీవితంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా శుక్రకణాల సంఖ్యను, వాటి నాణ్యతను సహజంగానే పెంచుకోవచ్చు.

మొదటిగా మనం తినే ఆహారం. మీ డైట్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-సి, విటమిన్-ఇ, జింక్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి.బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ ప్రతిరోజూ తినండి.ఆకుకూరలు, తాజా పండ్లు (ముఖ్యంగా దానిమ్మ, అరటిపండు, బెర్రీస్) శుక్రకణాల కదలికను మెరుగుపరుస్తాయి.అలాగే, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చేపలు, గుడ్లు మీ ఆహారంలో భాగం చేసుకోండి.

జీవనశైలి

రోజుకు కనీసం 30 నిమిషాల పాటు నడక, రన్నింగ్ లేదా యోగా చేయడం వల్ల శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు పెరిగి, శుక్రకణాలు వృద్ధి చెందుతాయి. ప్రతిరోజూ 7 నుండి 8 గంటల ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం. మానసిక ఒత్తిడి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. కాబట్టి మెడిటేషన్ లేదా మీకు నచ్చిన అలవాట్ల ద్వారా ఒత్తిడిని దూరంగా ఉంచండి.

కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం

ధూమపానం (Smoking),మద్యపానం (Alcohol) శుక్రకణాల ఉత్పత్తిని తీవ్రంగా దెబ్బతీస్తాయి. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.అలాగే, ల్యాప్‌టాప్‌లను ఒడిలో పెట్టుకుని వాడుకోవడం, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం వల్ల వృషణాల భాగంలో వేడి పెరుగుతుంది. ఇది శుక్రకణాల నాణ్యతను తగ్గిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించండి.

తగినంత నీరు తాగడం, బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ మార్పులను మీ జీవితంలో భాగం చేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం ఆలస్యం చేయకుండా ఒకసారి మంచి డాక్టర్‌ను సంప్రదించి సలహా తీసుకోవడం ఉత్తమం.

PolitEnt Media

PolitEnt Media

Next Story