Blood Donation : రక్తదానం చేసే ముందు ఈ ఆహారాలు తప్పక తినాలి

రక్తదానం అనేది అతి గొప్ప దానం. ఒక్క రక్తపు చుక్క విలువైన ప్రాణాన్ని కాపాడుతుంది. ఈ కారణంగా లక్షలాది మంది అవసరమైనప్పుడు రక్తదానం చేసే గొప్ప పనిని చేస్తున్నారు. మీరు కూడా రక్తదానం చేస్తున్నారా? అయితే రక్తదానం చేసే ముందు మీరు ఏ ఆహారాలు తినాలో తెలుసుకోండి.
బీట్‌రూట్: బీట్‌రూట్‌లో నైట్రేట్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచి రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి రక్తదానం చేసే ముందు బీట్‌రూట్ తీసుకోవడం మంచిది.
గుడ్డు: గుడ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ముఖ్యంగా ప్రోటీన్, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతాయి. ఇది రక్తదానం చేసిన తర్వాత వచ్చే అలసట, నీరసాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
పాలకూర: పాలకూరలో ఐరన్, ఫోలేట్ అధికంగా ఉంటాయి. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. అందుకే రక్తదానం చేయడానికి ఒకటి లేదా రెండు రోజుల ముందు పాలకూర తీసుకోవడం మంచిది.
నారింజ: సిట్రస్ పండ్లలో ఒకటైన నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఐరన్ శోషణను పెంచుతుంది. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతాయి. రక్త ప్రసరణను నిర్వహించడానికి సహాయపడతాయి.
బాదం: బాదంలో ప్రోటీన్, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అవి రక్తదానం చేసిన తర్వాత అలసటను నివారిస్తాయి.
మటన్: మటన్ లో ఐరన్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతాయి. అందుకే రక్తదానం చేసే ముందు మటన్ తినడం చాలా మంచిది. ఇది మంచి శక్తిని కూడా అందిస్తుంది.
నీరు ఎక్కువగా త్రాగాలి: మన శరీరంలోని సగం రక్తం నీటితో తయారవుతుంది. రక్తదాన ప్రక్రియలో మీరు కొంత ద్రవాన్ని కోల్పోయినప్పుడు, మీ రక్తపోటు తగ్గవచ్చు. దీని వల్ల మీకు తల తిరుగుతున్నట్లు అనిపించవచ్చు. కాబట్టి పుష్కలంగా నీరు త్రాగాలి.
