కేవలం 45 నిమిషాల నడకతో మీ బాడీలో జరిగే మ్యాజిక్ ఇదే..

Magic 45 Minutes of Walking: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఫిట్‌గా ఉండటం ఒక సవాలుగా మారింది. చాలా మందికి జిమ్‌లకు వెళ్లి గంటల తరబడి కష్టపడే సమయం ఉండదు. అయితే, ఖరీదైన జిమ్ మెంబర్‌షిప్‌లు లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని సైన్స్ చెబుతోంది. రోజుకు కేవలం 45 నిమిషాల నడకతో మీ శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

నడకతో ఎన్ని కేలరీలు ఖర్చవుతాయి?

నడక ద్వారా ఖర్చయ్యే కేలరీలు మీ బరువు, వయస్సు మరియు నడిచే వేగంపై ఆధారపడి ఉంటాయి..

55-60 కిలోల బరువు ఉన్నవారు: 45 నిమిషాల నడకతో 150-180 కేలరీలు బర్న్ చేయవచ్చు.

65 -75 కిలోల బరువు ఉన్నవారు: సుమారు 180–220 కేలరీలు ఖర్చవుతాయి.

బ్రిస్క్ వాకింగ్ : మీరు కొంచెం వేగంగా అడుగులు వేస్తే, ఏకంగా 250 -320 కేలరీల వరకు కరిగించవచ్చు.

నెలవారీ లెక్క: మీరు వారానికి కనీసం 5 రోజులు క్రమం తప్పకుండా నడిస్తే, నెలకు 6000 నుండి 9000 కేలరీలు బర్న్ చేసే అవకాశం ఉంది.

45 నిమిషాల నడకతో కలిగే టాప్-4 ప్రయోజనాలు:

గుండెకు శ్రీరామరక్ష:

రోజూ నడవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. తద్వారా గుండెపోటు , స్ట్రోక్ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది.

బరువు తగ్గడానికి దివ్యౌషధం:

నడక మీ మెటబాలిజంను వేగవంతం చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడానికి ఇది అత్యంత సులభమైన, ప్రభావవంతమైన మార్గం.

షుగర్ కంట్రోల్ - కండరాల బలం:

మధుమేహ బాధితులకు నడక ఒక వరం లాంటిది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడమే కాకుండా కీళ్ల నొప్పులను తగ్గించి కండరాలను దృఢంగా మారుస్తుంది.

ఒత్తిడి మాయం.. ప్రశాంతమైన నిద్ర

నడిచేటప్పుడు మన శరీరంలో ఎండార్ఫిన్లు అనే హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మానసిక ఒత్తిడిని తగ్గించి, మూడ్‌ను రిఫ్రెష్ చేస్తాయి. దీనివల్ల రాత్రిపూట హాయిగా, గాఢ నిద్ర పడుతుంది.

నిపుణుల సూచన

వాకింగ్ ప్రారంభించే ముందు మంచి గ్రిప్ ఉన్న స్పోర్ట్స్ షూస్ ధరించండి. అలాగే నడుస్తున్నప్పుడు శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి తగినంత నీరు తాగుతూ ఉండాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story