Kiwi Fruit: పోషకాల గని కివి పండు.. క్రమం తప్పకుండా తింటే అద్భుత ఫలితాలు
క్రమం తప్పకుండా తింటే అద్భుత ఫలితాలు

Kiwi Fruit: కివి పండును పోషకాల గనిగా చెప్పవచ్చు. ఇది విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఇ, ఫోలేట్, పొటాషియం, ఫైబర్ యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. ఈ పండును క్రమం తప్పకుండా తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు బరువు తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది. కివి పండుతో కలిగే అదనపు ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె ఆరోగ్యానికి ఉత్తమం :
కివి పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, శరీరంలోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
మంచి నిద్రకు దివ్యౌషధం :
కివి పండులో అధికంగా ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ పండులో ఉండే ఆక్టినిడిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్లను విచ్ఛిన్నం చేసి జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. కివిలో ఉండే న్యూరోట్రాన్స్‌మిటర్ సెరోటోనిన్ నిద్రను ప్రేరేపిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, కివి పండు తినడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. నిద్రలేమితో బాధపడేవారికి ఇది ఒక మంచి పరిష్కారం.
ఆస్తమాకు చెక్ :
కివి పండులో ఉన్న విటమిన్ సి యాంటీఆక్సిడెంట్లు ఆస్తమా లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ పండును క్రమం తప్పకుండా తినడం వల్ల దగ్గు శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు తగ్గుతాయని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. అంతేకాకుండా, కివి పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు ఇతర ఫైటోకెమికల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి. కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా ఇది తగ్గిస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారికి :
బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నవారికి కివి ఒక గొప్ప ఆహారం. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువ సమయం కడుపు నిండిన భావన కలిగించి అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. ఈ పండ్లకు తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగవు. ఇది మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవాలనుకునే వారికి మంచిది.
కంటి ఆరోగ్యానికి :
కివి పండ్లలో ఉండే లుటిన్ జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి వయస్సు సంబంధిత మాక్యులర్ డీజెనరేషన్ కంటిశుక్లం వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే, ఇందులో ఉండే విటమిన్ సి యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి.
