Turned 50: 50 ఏళ్లు దాటాయా? మీ ఆహారంలో ఈ 5 పదార్థాలను వెంటనే తగ్గించండి.. నిపుణుల సూచనలు
నిపుణుల సూచనలు

Turned 50: వయస్సు 50 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో అనేక సహజ సిద్ధమైన మార్పులు ప్రారంభమవుతాయి. మెటబాలిజం మందగించడం, కండరాల బలం తగ్గడం, ఎముకల సాంద్రత తగ్గడం, హార్మోన్ల మార్పులు మరియు రోగనిరోధక శక్తి తగ్గడం వంటివి సాధారణం. ఈ వయస్సులో కేవలం పౌష్టికాహారం తీసుకోవడమే కాకుండా, శరీరానికి హాని కలిగించే కొన్ని ఆహార పదార్థాలను దూరంగా ఉంచడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు, కిడ్నీ సమస్యల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు. వయస్సు 50 దాటిన తర్వాత పరిమితం చేయాల్సిన 5 ముఖ్యమైన ఆహారాలు ప్రత్యామ్నాయాల వివరాలు..
మైదా - రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు
వైట్ బ్రెడ్, పాస్తా, కేకులు, బిస్కెట్లు మరియు మైదాతో చేసిన పదార్థాల్లో ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి, బరువు పెరిగేలా చేసి టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి.
ప్రత్యామ్నాయం: తృణధాన్యాలు, ఓట్స్, రాగులు, జొన్నలు, బ్రౌన్ రైస్ తీసుకోవడం శ్రేయస్కరం.
ప్రాసెస్ చేసిన మాంసం
ససాసేజ్‌లు, బేకన్, సలామీ, క్యాన్డ్ మీట్ వంటి ప్రాసెస్ చేసిన మాంసాహారాల్లో ఉప్పు, ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి బీపీని పెంచి, కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. కిడ్నీలపై కూడా తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి.
ప్రత్యామ్నాయం:
తాజా చేపలు, స్కిన్‌లెస్ చికెన్ లేదా శాకాహార ప్రొటీన్లను ఎంచుకోవడం మంచిది.
కృత్రిమ తీపి పదార్థాలు - ప్యాక్ చేసిన జ్యూస్‌లు
డైట్ సోడాలు, ప్యాక్ చేసిన జ్యూస్‌లు ఆరోగ్యకరమైనవిగా అనిపించినప్పటికీ, వీటిలో ఆర్టిఫిషియల్ స్వీటనర్లు, ప్రిజర్వేటివ్‌లు ఉంటాయి. ఇవి పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను దెబ్బతీసి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ మరియు ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
ప్రత్యామ్నాయం:
తాజా పండ్లు, నిమ్మరసం, పంచదార లేని మజ్జిగ, కొబ్బరి నీళ్ళు తాగడం మంచిది.
మితిమీరిన ఉప్పు - వేయించిన పదార్థాలు
చిప్స్, బజ్జీలు, పకోడీలు, ఫ్రెంచ్ ఫ్రైస్ మరియు ఎక్కువ ఉప్పు ఉండే పచ్చళ్లను తగ్గించాలి. ఇవి రక్తపోటును పెంచడమే కాకుండా, శరీరంలో నీరు చేరి కాళ్ల వాపులు రావడం, గుండె కిడ్నీ సమస్యలకు దారితీస్తాయి.
ఫుల్-ఫ్యాట్ డైరీ ఉత్పత్తులు
పూర్తి కొవ్వు ఉండే పాలు, చీజ్, వెన్న, క్రీమ్‌లలో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెంచి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
ప్రత్యామ్నాయం:
స్కిమ్మడ్ పాలు, తక్కువ కొవ్వు ఉన్న పెరుగు లేదా మజ్జిగ వాడటం శ్రేయస్కరం.
50 ఏళ్ల తర్వాత ఆహారంలో చేర్చుకోవాల్సిన పౌష్టికాహారాలు..
ఆకుకూరలు, పప్పుధాన్యాలు
తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్, గింజలు
ఓట్స్, తృణధాన్యాలు
ఒమేగా-3 సమృద్ధిగా ఉండే చేపలు
లో-ఫ్యాట్ డైరీ ఉత్పత్తులు
పాటించాల్సిన ఆరోగ్యకరమైన అలవాట్లు..
వ్యాయామం:
ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల నడక, వారానికి 2-3 సార్లు తేలికపాటి వ్యాయామాలు చేయాలి.
నిద్ర - నీరు:
రోజుకు 7–8 గంటల నిద్ర, 2–3 లీటర్ల నీరు తాగాలి.
అలవాట్లు: ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.
ఆరోగ్య పరీక్షలు:
ఏడాదికి ఒకసారి క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి.
క్రమం తప్పకుండా చేయించుకోవాల్సిన పరీక్షలు..
రక్తపోటు - బ్లడ్ షుగర్
లిపిడ్ ప్రొఫైల్
కిడ్నీ - లివర్ ఫంక్షన్ టెస్ట్‌లు
విటమిన్ D - విటమిన్ B12
బోన్ డెన్సిటీ పరీక్షలు

