త్వరగా కోలుకోవడానికి ఈ ఆహారాలు తప్పనిసరి..

Post-Miscarriage Recovery: మాతృత్వం ప్రతి స్త్రీకి మధురమైన అనుభూతి అయినప్పటికీ, ఆధునిక జీవనశైలి, ఒత్తిడితో కూడిన పరిస్థితుల కారణంగా కొంతమంది మహిళలు గర్భస్రావాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. గర్భస్రావం తర్వాత శరీరం, మనస్సు రెండూ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. ఈ సమయంలో సరైన జాగ్రత్తలు, ముఖ్యంగా సరైన ఆహారం తీసుకోవడం ద్వారా త్వరగా కోలుకోవచ్చు, ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

గర్భస్రావం తర్వాత రక్తస్రావం కారణంగా శరీరం బలహీనపడి ఐరన్ లోపం ఏర్పడుతుంది. దీంతో వికారం, వాంతులు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైద్యులు సూచించిన మందులతో పాటు శరీరం సాధారణ స్థితికి రావడానికి, మనస్సు ప్రశాంతంగా ఉండటానికి సరైన పోషకాహారం చాలా అవసరం. గర్భస్రావం తర్వాత మహిళలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహారాలు ,వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారాలు

గర్భస్రావం తర్వాత శరీరంలో ఐరన్ లోపం, రక్తహీనతను ఎదుర్కోవడానికి ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇది ఎర్ర రక్త కణాల స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా గర్భస్రావం తర్వాత వచ్చే నిరాశ నుండి కోలుకోవడానికి కూడా ఇది సహాయపడుతుంది. బాదం, వాల్‌నట్‌లు వంటి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి.

కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు

శరీరానికి బలం చేకూర్చడానికి, ఎముకల ఆరోగ్యం కోసం కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం. పాలు, పాల ఉత్పత్తులు, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తినాలి.

జీర్ణ సమస్యల నివారణకు..

గర్భస్రావం తర్వాత జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి, సమస్యలను తగ్గించడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. తృణధాన్యాలు, ఓట్స్, బ్రౌన్ రైస్, క్వినోవా వంటి ఆహారాలు జీర్ణక్రియకు సహాయపడతాయి. దీంతో పాటు శరీరానికి బలం చేకూర్చడానికి, కండరాలు కోలుకోవడానికి చికెన్, చేపలు తీసుకోవడం కూడా మంచిది.సరైన ఆహార నియమాలు, తగిన విశ్రాంతి తీసుకోవడం ద్వారా గర్భస్రావం తాలూకు శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించి మహిళలు త్వరగా తమ సాధారణ జీవితానికి తిరిగి రావచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story