Prediabetes and Hypertension: మన దేశంలో ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న సైలెంట్ కిల్లర్స్ ఏంటో తెలుసా? అవే హైపర్‌టెన్షన్ అనగా రక్తపోటు, డయాబెటిస్ లేదా మధుమేహం. పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే ఇవి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అందుకే నిపుణులు రెగ్యులర్ హెల్త్ స్క్రీనింగ్ అత్యంత కీలకమని హెచ్చరిస్తున్నారు.

ఇటీవలి ఆరోగ్య నివేదికల ప్రకారం, భారతదేశంలో హైపర్‌టెన్షన్, డయాబెటిస్, ప్రీ-డయాబెటిస్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, నిద్రలేమి, జంక్ ఫుడ్ అలవాట్లు కారణంగా చిన్న వయసులోనే ఈ సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ప్రీ-డయాబెటిస్ దశలో ఉన్నవారికి తమకు ఆ వ్యాధి ఉందనే విషయమే చాలాకాలం పాటు తెలియకపోవడం గమసార్హం.

హైపర్‌టెన్షన్,బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో లేకపోతే, అది క్రమంగా గుండెపోటు (Heart Attack), పక్షవాతం (Stroke), మూత్రపిండాల వైఫల్యం (Kidney Failure) వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది. అందుకే వీటిని సైలెంట్ కిల్లర్స్' అని పిలుస్తారు. ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ, శరీరంలో లోపలి నుంచి ఇవి అవయవాలను దెబ్బతీస్తాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

ముందస్తు గుర్తింపు కోసం క్రమం తప్పకుండా బ్లడ్ ప్రెషర్ (BP) ,బ్లడ్ షుగర్ పరీక్షలు చేయించుకోవాలి.

30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికిఒకసారైనా పూర్తి శరీర ఆరోగ్య పరీక్ష (Full Body Health Screening) చేయించుకోవడం మంచిది.

ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా వీటిని చాలావరకు అదుపులో ఉంచుకోవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story