Prostate Cancer: పురుషులలో నిశ్శబ్దంగా పెరిగే ప్రోస్టేట్ క్యాన్సర్.. ఈ 3 లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
ఈ 3 లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి..

Prostate Cancer: పురుషుల ఆరోగ్యానికి సంబంధించి అతి తక్కువగా చర్చించబడే, అత్యంత ప్రమాదకరమైన వ్యాధులలోప్రోస్టేట్ క్యాన్సర్ ఒకటి. ముఖ్యంగా వయసు పైబడిన వారిలో ఇది ఒక ప్రధాన ఆరోగ్య ముప్పుగా మారుతోంది. ఈ వ్యాధిని సైలెంట్ కిల్లర్ లేదా నిశ్శబ్దంగా పెరిగే ప్రమాదంగా పరిగణిస్తారు. ఎందుకంటే, ప్రారంభ దశలలో దీనికి సంబంధించిన స్పష్టమైన లక్షణాలు ఏవీ బయటపడవు. చాలా మంది దీనిని వృద్ధాప్యంలో వచ్చే సాధారణ శారీరక మార్పుగా భావించి నిర్లక్ష్యం చేయడం వల్లే ముప్పు మరింత పెరుగుతోంది.
మూత్రవిసర్జనలో మార్పులు.. ఇవే హెచ్చరిక సంకేతాలు..
ప్రోస్టేట్ గ్రంథిలో మార్పులు వచ్చినప్పుడు అవి నేరుగా మూత్రవిసర్జన ప్రక్రియపై ప్రభావం చూపుతాయి. ఈ క్రింది లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు..
తరచుగా మూత్రవిసర్జన:
పగటిపూట మరియు ముఖ్యంగా రాత్రిపూట చాలాసార్లు టాయిలెట్‌కు వెళ్లాల్సి రావడం.
మూత్రవిసర్జనలో ఇబ్బంది:
మూత్రం సరిగ్గా రాకపోవడం లేదా ఇబ్బందిగా అనిపించడం.
బలహీనమైన మూత్రధార:
మూత్రధార చాలా బలహీనంగా సాగడం. చాలా మంది పురుషులు ఇవన్నీ వృద్ధాప్యానికి సంబంధించిన సహజ సంకేతాలని పొరబడతారు. కానీ, ఇవి క్యాన్సర్ ప్రారంభ హెచ్చరిక సంకేతాలు కావచ్చు.
సిగ్గు, సంకోచం ప్రాణాంతకం కావచ్చు..
ఈ వ్యాధి ముదరడానికి ప్రధాన కారణం పురుషులలో ఉండే సిగ్గు, సంకోచం. మూత్ర సంబంధిత లేదా లైంగిక ఆరోగ్య సమస్యల గురించి కుటుంబ సభ్యులతో, స్నేహితులతో లేదా చివరికి వైద్యులతో కూడా బహిరంగంగా మాట్లాడటానికి చాలా మంది వెనుకాడుతుంటారు. "ఇది వయసుతో పాటు వచ్చే సహజమైన సమస్యేలే" అనే నమ్మకంతో కాలం వెళ్లదీస్తుంటారు. దీనివల్ల వ్యాధిని నిర్ధారించే సమయానికి అది చివరి దశకు చేరుకుంటుంది. ఫలితంగా చికిత్స అందించడం వైద్యులకు కూడా కష్టంగా మారుతుంది.
ముందస్తు పరీక్షలే శ్రీరామరక్ష:
ఒక నిర్దిష్ట వయస్సు దాటిన పురుషులు, ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.
- Prostate CancerMen’s HealthCancer AwarenessEarly SymptomsHealth AlertPreventive HealthcareCancer ScreeningUrologyMen’s WellnessMedical AwarenessHealth TipsEarly DetectionHealthy LivingOncologyHealthcare EducationPublic HealthLatest Telugu NewsHealth UpdatesDisease PreventionMedical AdviceCancer Care

