Raw Mango Benefits: పచ్చి మామిడితో బోలెడు లాభాలు.. వడదెబ్బ నుండి లివర్ ఆరోగ్యం వరకు అన్నీ సెట్..
వడదెబ్బ నుండి లివర్ ఆరోగ్యం వరకు అన్నీ సెట్..

Raw Mango Benefits: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. నోరూరించే పచ్చి మామిడికాయలు ప్రతిచోటా కనిపిస్తాయి. కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా పచ్చి మామిడిని మితంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, సి, ఇ తో పాటు కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పచ్చి మామిడి వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఇవే..
వడదెబ్బ నుండి రక్షణ
ఎండ తీవ్రత నుండి శరీరాన్ని కాపాడుకోవడానికి పచ్చి మామిడి ఒక దివ్యౌషధం. దీనితో తయారు చేసే లేదా పచ్చి మామిడి రసం తాగడం వల్ల శరీరం చల్లబడటమే కాకుండా ఎండదెబ్బ తగలకుండా రక్షణ లభిస్తుంది. ఇది శరీరానికి అవసరమైన తేమను అందిస్తుంది.
జీర్ణక్రియ మెరుగుపడటం - అసిడిటీ నివారణ..
పచ్చి మామిడిలో ఉండే ఫైబర్, పెక్టిన్ అంశాలు జీర్ణ వ్యవస్థను బలపరుస్తాయి. అసిడిటీ లేదా గ్యాస్ సమస్యతో బాధపడేవారు పచ్చి మామిడి ముక్కలను కొద్దిగా నల్ల ఉప్పు తో కలిపి తీసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.
కాలేయాన్ని శుద్ధి చేస్తుంది
పచ్చి మామిడి కాలేయానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది పైత్యరసం స్రావాన్ని నియంత్రించి, కాలేయాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి, కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.
రోగనిరోధక శక్తి & కంటి చూపు:
ఇందులో ఉండే విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. అలాగే విటమిన్ ఎ పుష్కలంగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడటమే కాకుండా, రేచీకటి వంటి సమస్యలు రాకుండా నిరోధిస్తుంది.
తర్మం మరియు జుట్టు సౌందర్యం:
పచ్చి మామిడిలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. శరీరాన్ని నిర్విషీకరణ చేయడం ద్వారా చర్మంపై సహజమైన మెరుపు వస్తుంది మరియు జుట్టు రాలడం వంటి సమస్యలు తగ్గుతాయి.
పచ్చి మామిడిని చట్నీ రూపంలో గానీ, పప్పులో గానీ లేదా ఉప్పు, కారం అద్దుకుని గానీ మితంగా తీసుకోవడం వల్ల ఈ వేసవిలో ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే, అతిగా తింటే పంటి పులుపు లేదా ఇతర ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నందున మితంగా తీసుకోవడమే మంచిది.

