Rising Fatty Liver Risk Among Youth: గతంలో 40 ఏళ్లు పైబడిన వారిలో మాత్రమే కనిపించే ఫ్యాటీ లివర్ సమస్య, ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా యువతలో, చిన్న పిల్లల్లో కూడా ఆందోళనకరంగా పెరుగుతోంది. కేవలం మద్యపానం వల్ల మాత్రమే కాకుండా మనం తీసుకునే రోజువారీ ఆహారం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎందుకు వస్తుంది? ప్రధాన కారణాలు ఇవే..

బయటి ఆహారం ఎక్కువగా తినడం వల్ల ఈ సమస్య తలెత్తుతోంది.

మైదా వాడకం:

హోటల్స్, బేకరీలలో లభించే రొట్టెలు, ఇతర పదార్థాలు శుద్ధి చేసిన పిండితో తయారు చేస్తారు. ఇది నేరుగా కాలేయంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది.

చక్కెర & పానీయాలు:

శీతల పానీయాలు (, మితిమీరిన స్వీట్లు కాలేయానికి ముప్పుగా మారుతున్నాయి.

నూనె పదార్థాలు:

వేయించిన ఆహారాలు తీసుకోవడం వల్ల కాలేయం పనితీరు మందగిస్తుంది.

ఫ్యాటీ లివర్ దశలు - ఏది ప్రమాదకరం?

ఫ్యాటీ లివర్ సమస్య గ్రేడ్-1 నుంచి మొదలై సిర్రోసిస్ వరకు దారితీస్తుంది.

లివర్ ఫైబ్రోసిస్: కొవ్వు పేరుకుపోవడం వల్ల కాలేయం దెబ్బతినడం మొదలవుతుంది.

లివర్ సిర్రోసిస్: ఇది అత్యంత ప్రమాదకరమైన దశ. ఈ స్థితికి చేరిన రోగులకు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ మాత్రమే మార్గం.

గుర్తించదగ్గ లక్షణాలు:

ప్రారంభంలో ఈ వ్యాధి లక్షణాలు బయటకు కనిపించవు. కానీ కాలక్రమేణా ఈ క్రింది మార్పులు కనిపిస్తాయి..

ఎప్పుడూ అలసటగా అనిపించడం.

పొట్టకు కుడివైపున స్వల్పంగా నొప్పి రావడం.

అకస్మాత్తుగా బరువు పెరగడం.

నివారణ మార్గాలు:

ఆహారంలో మార్పు: ఆకుకూరలు, కూరగాయలు మరియు తాజా పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.

శారీరక శ్రమ: ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం తప్పనిసరి.

నియంత్రణ:

శరీర బరువుతో పాటు రక్తంలో చక్కెర ట్రైగ్లిజరైడ్ స్థాయిలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story