fic Breakthrough: వైజ్ఞానిక అద్భుతం: స్టెమ్ సెల్స్ తో మళ్లీ ఒరిజినల్ పళ్లు మొలిపించే దిశగా శాస్త్రవేత్తల ప్రయోగాలు..
శాస్త్రవేత్తల ప్రయోగాలు..

Scientific Breakthrough: సాధారణంగా దంతాలు ఊడిపోయినా లేదా పాడైపోయినా ఇప్పటివరకు ఆర్టిఫిషియల్ డెంచర్లు, ఇంప్లాంట్లు లేదా క్యాప్‌లను మాత్రమే వాడుతున్నాం. కానీ, త్వరలోనే డ్రిల్లింగ్, ఫిల్లింగ్స్ వంటి పాత పద్ధతులకు శాస్త్రవేత్తలు శుభకార్డు చెప్పబోతున్నారు. స్టెమ్ సెల్స్ సహాయంతో మానవులలో సహజమైన ఒరిజినల్ పళ్లను తిరిగి మొలిపించే ప్రక్రియపై శాస్త్రవేత్తలు పరిశోధనలు వేగవంతం చేశారు.
పునరుత్పత్తి దంత వైద్యం అంటే ఏమిటి?
వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త రూహోల్లా బాకర్ వంటి పరిశోధకులు ఈ విప్లవాత్మక ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నారు.
లక్ష్యం: కృత్రిమ పదార్థాలతో పళ్లను నింపడానికి బదులుగా, నోట్లోని దెబ్బతిన్న కణజాలాలను స్టెమ్ సెల్స్ ద్వారా ఉత్తేజపరిచి, సహజంగానే ఎనామిల్, డెంటిన్ పొరలను పునరుత్పత్తి చేసేలా చేయడం.
లివింగ్ ఫిల్లింగ్స్:
ప్రస్తుతం వాడుతున్న పళ్ల ఫిల్లింగ్స్ 5 నుండి 20 ఏళ్ల వరకు మాత్రమే మన్నుతాయి. కానీ శాస్త్రవేత్తలు రూపొందిస్తున్న ఈ లివింగ్ ఫిల్లింగ్స్ పంటిని దానికదే సహజంగా బాగుచేసుకునేలా చేస్తాయి.
జంతువుల జన్యు రహస్యం – ప్రయోగశాల విజయాలు
సొరచేపలు, పందులలో పళ్లు సహజంగా మళ్లీ మళ్లీ మొలిచే అద్భుతమైన సామర్థ్యం ఉంటుంది. ఆ జీవుల జీవక్రియను ఆధారంగా చేసుకుని, మానవ స్టెమ్ సెల్స్ ద్వారా ప్రయోగశాలల్లో సొంత దంతాలను పెంచే ప్రయోగాలు చేశారు. శస్త్రచికిత్స అవసరం లేకుండా మన శరీరంలో ఉండే కణాలనే ఉపయోగించి కొత్త పంటిని ఉత్పత్తి చేయడమే ఈ సాంకేతికత ముఖ్య ఉద్దేశం.
నోటి ఆరోగ్యం – శరీరంపై దాని ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 శాతం మంది ప్రజలు డెంటిస్ట్ దగ్గరకు వెళ్లడానికి, డ్రిల్లింగ్ నొప్పులకు భయపడుతుంటారు. దీనివల్ల చాలామంది నోటి సంరక్షణను నిర్లక్ష్యం చేస్తుంటారు.
చిగుళ్ల వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా వల్ల కేవలం పళ్లు మాత్రమే కాకుండా... గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు, అల్జీమర్స్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని పరిశోధనల్లో తేలింది. కాబట్టి, నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం శరీర ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం.
అందుబాటులోకి ఎప్పుడు వస్తుంది?
ప్రస్తుతం మానవ మరియు జంతు కణాలతో ప్రయోగశాలలో జరిపిన పరీక్షలు విజయవంతమయ్యాయి. ఈ సాంకేతికత మానవ హ్యూమన్ ట్రయల్స్ పూర్తి చేసుకుని సాధారణ ప్రజలకు అందుబాటులోకి రావడానికి ఇంకా కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. అయితే, ఇది అందుబాటులోకి వస్తే దంత వైద్య చరిత్రలోనే ఒక విప్లవాత్మక మార్పు రావడం ఖాయం..

