Seeing Blood in Your Urine After a Workout: వర్కౌట్ చేశాక మూత్రంలో రక్తం పడుతోందా?
రక్తం పడుతోందా?

Seeing Blood in Your Urine After a Workout: ఫిట్‌నెస్ కోసం ప్రతిరోజూ జిమ్‌లో వర్కౌట్స్ లేదా రన్నింగ్ చేస్తుంటాం. అయితే, తీవ్రమైన వ్యాయామం చేసిన తర్వాత మూత్రం ఎర్రగా రావడం లేదా రక్తం పడటం గమనించారా? దీనిని వైద్య పరిభాషలో 'ఎక్సర్‌సైజ్ ఇండ్యూస్డ్ హెమటూరియా' (Exercise-induced Hematuria) లేదా 'స్పోర్ట్స్ హెమటూరియా' అంటారు. ఇది ఎందుకు జరుగుతుంది? దీని వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రధాన కారణాలు
యూర్లజిస్ట్‌ల ప్రకారం... వ్యాయామం తర్వాత మూత్రంలో రక్తం పడటానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి.
డీహైడ్రేషన్ (Dehydration): వర్కౌట్ చేసే సమయంలో ఒంట్లో నీటి శాతం తగ్గిపోతే, మూత్రపిండాలు మూత్రాన్ని ఎక్కువగా గాఢత (Concentrated) చేస్తాయి. దీనివల్ల మూత్రాశయం (Bladder) గోడలకు రాపిడి కలిగి రక్తం రావచ్చు.
బ్లాడర్ ట్రామా (Bladder Trauma): రన్నింగ్ లేదా జంపింగ్ లాంటి హై-ఇంపాక్ట్ వ్యాయామాలు చేసినప్పుడు ఖాళీగా ఉన్న మూత్రాశయం గోడలు ఒకదానికొకటి గుద్దుకోవడం వల్ల స్వల్ప రక్తస్రావం జరుగుతుంది.
కండరాల దెబ్బతినడం (Rhabdomyolysis): అతిగా వర్కౌట్ చేయడం వల్ల కండరాలు దెబ్బతిని 'మైయోగ్లోబిన్' అనే ప్రొటీన్ విడుదలవుతుంది. ఇది మూత్రాన్ని ఎరుపు లేదా గోధుమ రంగులోకి మారుస్తుంది."
చాలా సందర్భాల్లో ఇది వ్యాయామం ముగిసిన 24 నుండి 48 గంటల్లో విశ్రాంతి తీసుకుంటే దానంతట అదే తగ్గిపోతుంది. కానీ, ఇది కేవలం వర్కౌట్ వల్లే కాకుండా... లోపల ఉన్న కిడ్నీ స్టోన్స్ (రాయి ఉండటం), యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (UTI), లేదా మూత్రాశయ సంబంధిత తీవ్రమైన సమస్యలు లేదా ఇన్ఫెక్షన్ల వల్ల కూడా కావచ్చు.
వ్యాయామం ఆపిన 48 గంటల తర్వాత కూడా మూత్రంలో రక్తం పడుతుంటే... లేదా దాంతో పాటు తీవ్రమైన పొత్తికడుపు నొప్పి, వీపు నొప్పి, జ్వరం, లేదా మూత్ర విసర్జనలో తీవ్రమైన మంట ఉంటే ఏమాత్రం అలక్ష్యం చేయకుండా వెంటనే యూర్లజిస్ట్ (Urologist) ను సంప్రదించాలి.
వర్కౌట్ చేసేటప్పుడు తగినంత నీరు తాగడం (Hydration) మర్చిపోకండి. శరీర సంకేతాలను గమనిస్తూ సురక్షితంగా వ్యాయామం చేయండి.

