నిశ్శబ్ద గుండెపోటుకు కారణాలు ఏంటో తెలుసా..?

Silent Heart Attacks: ఆఫీసులో గంటల తరబడి కూర్చోవడం, ఇంటికొచ్చాక కూడా అదే పని కొనసాగించడం.. ఇది కేవలం ఒకరో, ఇద్దరో ఎదుర్కొంటున్న సమస్య కాదు. ఆధునిక జీవనశైలిలో ఇది ఒక భాగమైపోయింది. అయితే ఈ అలవాటు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసి, 'నిశ్శబ్ద గుండెపోటు' ప్రమాదాన్ని పెంచుతుందని వారు అంటున్నారు. నిరంతరం కూర్చోవడం ధూమపానం ఎంత హానికరమో అంత హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిశ్శబ్ద గుండెపోటు అంటే ఏమిటి?

నిశ్శబ్ద గుండెపోటును వైద్య పరిభాషలో 'సైలెంట్ అటాక్' అని కూడా అంటారు. ఈ రకమైన గుండెపోటులో ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, చెమట పట్టడం వంటి సాధారణ లక్షణాలు కనిపించవు. బదులుగా చాలా తక్కువ లక్షణాలు ఉంటాయి.. లేదా అస్సలు కనిపించవు. గుండెకు రక్త ప్రసరణ ఆగిపోయినప్పటికీ శరీరం ఎటువంటి ముఖ్యమైన హెచ్చరికలను ఇవ్వదు. చాలామంది దీనిని సాధారణ అలసట లేదా ఒత్తిడిగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. ఈ నిశ్శబ్ద గుండెపోటు కారణంగా సకాలంలో చికిత్స అందక మరణాల ప్రమాదం పెరుగుతుంది.

ఇది గుండెను ఎలా ప్రభావితం చేస్తుంది?

ఎక్కువసేపు ఒకే చోట కదలకుండా కూర్చోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మందగిస్తుంది. ఫలితంగా రక్తం, ఆక్సిజన్ గుండెకు సరిగ్గా చేరవు. ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే నిరంతరం కూర్చోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, వెన్నునొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.

ఎవరికి ఎక్కువ ప్రమాదం?

గంటల తరబడి డెస్క్ వద్ద కూర్చునే ఉద్యోగులు

అధిక బరువు లేదా కడుపు చుట్టూ కొవ్వు ఉన్నవారు

అధిక రక్తపోటు లేదా మధుమేహం ఉన్న రోగులు

ధూమపానం మరియు మద్యం సేవించే అలవాటు ఉన్నవారు

తీవ్రమైన ఒత్తిడి మరియు నిద్రలేమితో బాధపడేవారు.

ఎలా నివారించాలి?

ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం అవసరం.

శారీరక శ్రమ: ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం, నడక తప్పనిసరి.

విరామం: ప్రతి 30 నుంచి 40 నిమిషాలకు ఒకసారి కుర్చీలోంచి లేచి కొద్ది దూరం నడవాలి.

ఆహారం: సమతుల్య ఆహారం తీసుకోవాలి.

దురలవాట్లకు దూరం: ధూమపానం, మద్యం సేవించడం పూర్తిగా మానుకోవాలి.

నిద్ర: కనీసం 7-8 గంటల పాటు నిద్రపోవాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story