People With Diabetes Completely Avoid Carbohydrates: రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు చాలామంది కంగారుపడి అన్నం, రోటీలతో సహా అన్ని రకాల పిండి పదార్థాలను పూర్తిగా మానేస్తుంటారు. అయితే కార్బోహైడ్రేట్లను పూర్తిగా దూరం పెట్టాల్సిన అవసరం లేదని, సరైన రకాన్ని, తగిన మోతాదులో ఎంచుకుంటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మధుమేహ నియంత్రణకు అవసరమైన సమతుల్య ఆహారం, తీసుకోవాల్సిన పానీయాలు, జాగ్రత్తల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లను ఎంచుకోండి

అన్ని పిండిపదార్థాలూ శరీరంలో ఒకేలా చక్కెరను పెంచవు. శుద్ధి చేసిన మైదా, పంచదార వంటి వాటికి బదులుగా పీచు (ఫైబర్) ఎక్కువగా ఉండే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను ఎంచుకోవాలి:

ఓట్స్, బార్లీ: రక్తంలో గ్లూకోజ్ నిదానంగా కలవడానికి తోడ్పడతాయి.

పప్పుధాన్యాలు, రాజ్మా, శనగలు: ప్రోటీన్‌తో పాటు మంచి పీచును అందిస్తాయి.

తాజా పండ్లు: పండ్ల రసాలు తాగడం కంటే, పండ్లను నేరుగా ముక్కలుగా తినడం వల్ల సహజ ఫైబర్ అందుతుంది.

చక్కెర లేని పానీయాలు మేలు

రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవడానికి శరీరానికి తగినంత తేమ అవసరం. తీపి కూల్‌డ్రింక్స్, ప్యాక్ చేసిన జ్యూస్‌ల బదులు ఈ పానీయాలు ఎంచుకోవచ్చు:

మంచినీరు: శరీర హైడ్రేషన్ కాపాడటానికి ఉత్తమమైనది.

గ్రీన్ టీ - మచ్చా టీ: తీపి కలపకుండా తాగడం వల్ల యాంటీఆక్సిడెంట్లు అందుతాయి.

బ్లాక్ కాఫీ: చక్కెర లేకుండా మితంగా తీసుకోవచ్చు.

ప్లెయిన్ స్పార్క్లింగ్ వాటర్: సోడాలకు బదులుగా వాడవచ్చు.

ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు

కండరాల పుష్టికి, రక్తంలో గ్లూకోజ్ హెచ్చుతగ్గులు లేకుండా ఉండటానికి సమతుల్య పోషకాలు అవసరం:

ప్రోటీన్లు: గుడ్లు, చేపలు, పప్పులు, సోయాబీన్స్, చక్కెర లేని పెరుగును భోజనంలో భాగం చేసుకోవాలి (కిడ్నీ సమస్యలు ఉన్నవారు ప్రోటీన్ మోతాదుపై వైద్యుల సలహా.

మంచి కొవ్వులు:

వాల్‌నట్స్, చియా గింజలు, అవిసె గింజలు, ఆలివ్ నూనె వంటివి రక్తనాళాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే వీటిలో కేలరీలు ఎక్కువ కాబట్టి మోతాదు మించకూడదు.

మధుమేహ నిర్వహణ అనేది కేవలం ఒక పూట ఆహారంతో ముగిసేది కాదు. క్రమం తప్పని వ్యాయామం, వైద్యులు సూచించిన మందుల వాడకం, ఆహార నియంత్రణ.. ఈ మూడూ సమపాళ్లలో ఉన్నప్పుడే చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఏదైనా కొత్త ఆహార ప్రణాళికను మొదలుపెట్టే ముందు వ్యక్తిగత నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరం.

Next Story