Skip the Gym This Weekend: ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్న మాట నిజం. వర్కౌట్ అంటే కేవలం జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై పరుగు పెట్టడం, వెయిట్స్ ఎత్తడం మాత్రమే కాదు. వారంలో ఒక్కసారైనా రోజువారీ జిమ్ రొటీన్‌కు బ్రేక్ ఇచ్చి, ఫన్‌గా ఉండే కొత్త వ్యాయామాలను ట్రై చేస్తే శరీరం ఫిట్‌గా ఉండటమే కాకుండా మనసుకు కూడా పీస్‌ఫుల్ అనుభూతి కలుగుతుంది. రెగ్యులర్ జిమ్‌లో చిన్న మార్పులు చేయడం వల్ల ఫిజికల్, మెంటల్ హ్యాపీనెస్ పెరుగుతుందని, వర్కౌట్స్ పై ఆసక్తి కూడా పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా వారానికి మూడు నుంచి ఆరు గంటల వరకు వ్యాయామం చేయాలని చెబుతున్నారు. మొదట్లో 30 నిమిషాలు చాలు. క్రమంగా సమయాన్ని పెంచుకోవచ్చు. ముఖ్యంగా వారంలో ఒక్కసారి రిలాక్స్‌డ్ వర్కౌట్ అవసరం.

అవుట్‌డోర్ యాక్టివిటీస్ వీకెండ్‌కు అద్భుతమైన ఎంపిక. జిమ్ నుంచి బ్రేక్ తీసుకోవడం అంటే వ్యాయామం నుంచి బ్రేక్ కాదు. వీకెండ్‌లో హైకింగ్, రాక్ క్లైంబింగ్ లేదా వాటర్ బెలూన్ బ్యాటిల్ వంటి అడ్వెంచర్ వర్కౌట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ప్రకృతిలో నడవడం మనసుకు అద్భుతమైన విశ్రాంతి ఇస్తుంది. ఆకుల రసరసలు, గాలి, దృశ్యాలు మెదడును సున్నితంగా ఆకర్షించి ఒత్తిడిని తగ్గిస్తాయి. నిపుణులు చెబుతున్నట్టు, ప్రకృతి సంపర్కం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సాధారణ వాక్ కూడా గంటల తరబడి జిమ్‌లో కూర్చోవడం కంటే మంచిది.

డాన్స్ క్లాస్ లేదా ఇంట్లోనే మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్స్ చేయడం కూడా గొప్ప ఆప్షన్. హెవీ వర్కౌట్స్ తర్వాత మెదడుకు రిలాక్సేషన్ అవసరం. యోగా, డాన్స్, సంగీతం వంటివి ఆ మార్గాలు. వారంలో ఒక్కసారైనా వీటిని ట్రై చేస్తే జిమ్ టైమ్‌ను బ్యాలెన్స్ చేసినట్లు అవుతుంది. మనసుకు పీస్‌ఫుల్ ఎక్సర్‌సైజ్ అవుతుంది. డాన్స్ చేస్తే శరీరంలో రక్తప్రసరణ మెరుగవుతుంది, క్యాలరీలు ఖర్చవుతాయి. అంతేకాకుండా ఆనందంగా ఉంటుంది. ఇంట్లోనే యూట్యూబ్‌లో డాన్స్ రొటీన్ ఫాలో చేసి చేయవచ్చు.

బ్యాలెన్సింగ్ యోగా కూడా చాలా ఉపయోగకరం. కొన్ని యోగాసనాలు శరీరాన్ని స్ట్రాంగ్‌గా చేస్తాయి. ఆర్మ్ బ్యాలెన్స్ వంటి ఆసనాలు శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతాయి. యోగా చేస్తే ఒత్తిడి తగ్గుతుంది, మనసు శాంతిస్తుంది. వీకెండ్ ఉదయం పార్క్‌లో లేదా ఇంట్లో యోగా చేయడం గొప్ప అలవాటు. నిశ్శబ్దంగా యోగా చేయడం లేదా మ్యూజిక్‌తో కలిపి చేయడం కూడా ప్రయత్నించవచ్చు.

మెట్లు ఎక్కడం, దిగడం పాత స్టైల్ అనిపించవచ్చు కానీ చాలా మంచిది. వారంలో ఒక్కసారైనా స్టెప్స్‌పై నడవడం అలవాటు చేసుకోండి. ఇది కాళ్లకు, గుండెకు మంచి వ్యాయామం. లిఫ్ట్ వాడకుండా మెట్లు వాడటం వల్ల శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. ఇంట్లో లేదా ఆఫీస్‌లోనే చేయవచ్చు.

వీకెండ్‌లో పిల్లలతో గేమ్స్ ఆడటం, బైక్ రైడింగ్ చేయడం, చుట్టుపక్కల ప్రాంతాలను, ఇంటిని శుభ్రం చేయడం కూడా వర్కౌట్‌లో భాగం చేసుకోవచ్చు. ఈ కార్యకలాపాలు శరీరాన్ని కదిలిస్తాయి. అదే సమయంలో కుటుంబంతో సమయం గడపవచ్చు. పిల్లలతో ఆడుతుంటే మనసు తేలికగా అనిపిస్తుంది. బైక్ రైడింగ్ చేస్తే గాలి, దృశ్యాలు మనసుకు ఆహ్లాదం కలిగిస్తాయి. ఇంటి పనులు చేస్తూ కూడా క్యాలరీలు ఖర్చవుతాయి.

మైండ్‌ఫుల్ వాక్ కూడా ట్రై చేయండి. ఫోన్ లేకుండా పార్క్‌లో లేదా రోడ్డు పక్కన నడవండి. ప్రతి అడుగుపై దృష్టి పెట్టండి. చుట్టూ ఉన్న దృశ్యాలను గమనించండి. ఇలాంటి నడక మెదడును శాంతపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. కేవలం 10-15 నిమిషాలు చేసినా చాలు. ఇది జిమ్‌లో గంటలు గడపడం కంటే మనసుకు మంచిది.

ఈ వర్కౌట్స్ అన్నీ ఒకే రోజు చేయాల్సిన అవసరం లేదు. వీకెండ్‌లో ఒకటి రెండు ఎంచుకుని చేయండి. ముఖ్యం ఆనందంగా చేయడం. జిమ్‌లో ఒత్తిడిగా అనిపించే వ్యాయామం కంటే ఇవి మనసుకు శాంతి ఇస్తాయి. శరీరం ఫిట్‌గా ఉండటంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఈ వారం వీకెండ్‌లో ఒకటైనా ట్రై చేసి చూడండి. మార్పు కచ్చితంగా అనిపిస్తుంది.

Next Story