Stopping Cancer Is in Our Hands: క్యాన్సర్‌ బారిన పడితే ఇక మనమేమీ చేయలేమనే నిరాశలో బతికేస్తుంటాం. కానీ, అసలు నిజం ఏంటో తెలుసా? మన చేతుల్లోనే క్యాన్సర్‌ను అడ్డుకునే ఒక అద్భుతమైన ఆయుధం ఉంది! ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజా అధ్యయన విశ్లేషణ ప్రకారం... మూడింట ఒకవంతు కంటే ఎక్కువ క్యాన్సర్లు కేవలం నివారించుకోదగినవే. అంటే మనం తలుచుకుంటే ఆ క్యాన్సర్లు రాకుండా ఆపుకోవచ్చు!

నిజానికి క్యాన్సర్లకు జన్యు స్వభావం, ఆహార అలవాట్ల దగ్గరి నుంచి పర్యావరణ కాలుష్యం వరకూ రకరకాల కారణాలు ఉంటాయి. మనం మన జన్యు స్వభావాన్ని మార్చలేం కావచ్చు... కానీ మన జీవనశైలిని ఖచ్చితంగా మార్చుకోవచ్చు. ఈ తాజా అధ్యయనం ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఒక్క 2022 లోనే మొత్తం ఒక కోటీ 87 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదు కాగా... అందులో దాదాపు 38 శాతం అంటే.. 71 లక్షల క్యాన్సర్లు మనం మార్చుకోదగిన 30 రకాల అలవాట్లు, కారకాల వల్లే వచ్చాయట!

"ఇంకా దారుణమైన విషయం ఏంటంటే.. ఇలా నివారించుకోదగిన క్యాన్సర్లలో దాదాపు సగం ఊపిరితిత్తి, జీర్ణాశయ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లే ఉన్నాయి. పొగాకు, మద్యానికి పూర్తిగా దూరంగా ఉంటే.. సుమారు 50 శాతం క్యాన్సర్లను అసలు రాకుండానే నివారించుకోవచ్చు."

పరిశోధకులు గుర్తించిన ఆ ముప్పు కారకాలు ఏంటో తెలుసా? సిగరెట్లు, బీడీలు కాల్చడం.. మితిమీరి మద్యం తాగడం.. శరీర ఎత్తు-బరువు నిష్పత్తి (BMI) పెరగడం.. తగినంత శారీరక శ్రమ చేయకపోవడం.. గుట్కా, జర్దా, వక్కపొడి వంటి పొగాకు ఉత్పత్తులు నమలడం ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ఇవే కాకుండా వాయు కాలుష్యం, పనిచేసే చోట్ల ప్రమాదకర రసాయనాల ప్రభావం, మహిళలు తమ పిల్లలకు తగినన్ని రోజులు చనుబాలు పట్టకపోవడం వల్ల కూడా క్యాన్సర్ ముప్పు పెరుగుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story