సోరియాసిస్ వచ్చే ప్రమాదం

Psoriasis: నడుము చుట్టు కొవ్వు పెరుకుపోయే వారిలో చర్మ వ్యాధి సోరియాసిస్ వచ్చే ప్రమాదం ఉందని యూకే పరిశోధకులు కనుగొన్నారు. 25 వేర్వేరు శరీర అవయవాలపై చేసిన పరిశీలనల్లో ఈ చర్మ వ్యాధికి బెల్లీ ఫ్యాట్ ఓ కారణమని గుర్తించారు. మహిళల్లో ఈ ముప్పు ఎక్కువని తెలిపారు. బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా ఊబకాయం స్థాయిని అంచనా వేయగలుగుతున్నా సోరియాసిస్ ముప్పును అంచనా వేయలేమని చెబుతున్నారు. సోరియాసిస్‌కు జన్యు మూలాలూ ఓ కారణం కావొచ్చు.

చర్మ సంబంధమైన దీర్ఘకాలిక వ్యాధి సోరియాసిస్ . దీర్ఘకాలికమైన రోగనిరోధక శక్తిలో మార్పుల వలన ఇది సంభవిస్తుంది. ఈ వ్యాధిలో నొప్పి, చర్మము మందము అవడం, వాపు, దురద, చేపపొట్టులాంటి పొలుసులు ఊడడం జరుగుతుంటుంది. ఈ వ్యాధి ముఖ్యముగా ముంజేతి వెనకభాగము, మోకాలు ముందుభాగము, తల, వీపు, ముఖము, చేతులు, పాదాలలో వస్తుంది. సరియైన చికిత్స లేనట్లైతే ఈ వ్యాధి జీవితాంతముంటుంది. కొన్ని వాతావరణ పరిస్థితులలో వ్యాధి పెరగడము, తగ్గడమూ సర్వసాధారణము.దీర్ఘకాలం బాధించే మొండి చర్మ వ్యాధుల్లో సొరియాసిస్ ముఖ్యమైనది.

ప్రపంచవ్యాప్తంగా 125 మిలియన్ల మంది సొరియాసిస్‌తో బాధపడుతున్నారని అంచనా. అంటే ప్రపంచ జనాభాలో మూడు శాతం మంది ఈ వ్యాధి బారినపడుతున్నారు. సొరియాసిస్ బాధితులు శారీరకంగా ఇబ్బందిపడుతూ, మానసికంగా నలిగిపోతూ వుంటారు. అందుకే దీనిని మొండి వ్యాధిగా పరిగణిస్తారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story